చౌకగా నోకియా స్మార్ట్‌ఫోన్లు : భారీ తగ్గింపు

22 Oct, 2018 19:17 IST|Sakshi

నోకియా 6.1, 5.1, 3.1 స్మార్ట్‌ఫోన్లు ఇపుడు చవకగా

బేసిక్‌ మోడల్స్‌పై రూ.1000-1500  దాకా తగ్గింపు

నోకియా 8 సిరాకోపై ఏకంగా రూ.13వేల  తగ్గింపు

సాక్షి, న్యూఢిల్లీ:  నోకియా స్మార్ట్ ఫోన్లు కొనాలనుకునే వారికి శుభవార్త. కొన్ని ఎంపిక చేసిన నోకియా స్మార్ట్‌ఫోన్ల ధరలను భారీగా తగ్గించింది. దీంతో ఇండియాలో నోకియా స్మార్ట్‌ఫోన్లు మరింత చవకగా వినియోగదారులకు అందుబాటులోకి వచ్చాయి. ఎంపిక చేసిన మోడల్స్ పై హెచ్‌ఎండీ గ్లోబల్ ధరలను  భారీగా తగ్గించింది.  ఎంట్రీ స్థాయి మోడళ్లపై వెయ్యి  రూపాయల నుంచి పదిహేనువందల వరకు తగ్గింపు ప్రకటించింది. అంతేనా.. తన ఫ్లాగ్‌షిప్‌ నోకియా పై  సుమారు 13వేల రూపాయల  తగ్గింపును అందిస్తోంది.

నోకియా 3.1: 3జీబీ/32 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర గతంలో రూ.11999గా ఉండగా ప్రస్తుత ధర రూ.10999.
నోకియా 6.1 : 3జీబీ/32జీబీ   వేరియంట్‌ ధర రూ. 13,499  (వెయ్యి రూపాయల  తగ్గింపు)
నోకియా 6.1 4జీబీ/64జీబీ  వేరియంట్‌  ధర రూ. 1,500 రేటు కోతతో రూ. 16,499గా ఉంది. 

 నోకియా 8 సిరాకో:   13వేల  రూపాయల భారీ తగ్గింపుతో ఇపుడు 36.999లకే లభ్యం.  ఈ ఏడాది లాంచ్‌ అయిన ఈ స్మార్ట్‌ఫోన్‌  ఎంఆర్‌పీ ధర 49,999.

ఆఫ్‌లైన్‌, ఆన్‌లైన్‌స్టోర్లు రెండింటిలోనూ ఈ  తగ్గింపు ధరలు వర్తిస్తాయని కంపెనీ వెల్లడించింది. మరో కొసమెరుపు ఏమిటంటే  తగ్గింపును ఇలానే ఉంచేయనుందని తెలుస్తోంది.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా