సెకన్లలో అయిపోతున్న ఫోన్‌, భారత్‌కు వచ్చేస్తోంది

22 Jun, 2018 19:46 IST|Sakshi
నోకియా ఎక్స్‌6 స్మార్ట్‌ఫోన్‌

నోకియా ఎక్స్‌6.. ఈ స్మార్ట్‌ఫోన్‌ గత నెలలో చైనాలో లాంచ్‌ అయింది. నాచ్‌ డిస్‌ప్లేతో వచ్చిన తొలి నోకియా ఫోన్‌ కూడా ఇదే. ఈ స్మార్ట్‌ఫోన్‌ చైనీస్‌ మార్కెట్‌లో దుమ్మురేపుతోంది. సెకన్లలో అవుటాఫ్‌ స్టాక్‌ అవుతుంది. ప్రస్తుతం ఈ స్మార్ట్‌ఫోన్‌ భారత్‌కు కూడా రాబోతుందట. నోకియా ఎక్స్‌6 సపోర్టు పేజీ ప్రస్తుతం కంపెనీ భారత్‌ వెబ్‌సైట్‌లో లైవ్‌గా ఉంది. డివైజ్‌ యూజర్‌ గైడ్‌ను కూడా వెబ్‌సైట్‌లో హోస్ట్‌ చేస్తోంది. దీంతో ఈ ఫోన్‌ కచ్చితంగా భారత్‌లో డీఓటీ రూపొందించిన నిబంధనలను అనుసరిస్తుందని తెలుస్తోంది. ‘మీ మొబైల్‌ డివైజ్‌ భారత డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ టెలికమ్యూనికేషన్స్‌ రూపొందించిన రేడియో తరంగాల అవసరాలను అనుకరిస్తూ తయారు చేశాం’ అని నోకియా సపోర్ట్‌ పేజీ నోట్స్‌లో పేర్కొంది. దేశీయ వెబ్‌సైట్‌లో ఈ పేజీని లైవ్‌గా ఉంచింది. త్వరలోనే దీనిపై ప్రకటన కూడా చేయబోతుంది. 

నాచ్‌ డిస్‌ప్లే, వెనుక వైపు నిలువుగా రెండు కెమెరాలు, ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్లు దీనిలో ఉన్నాయి. 4జీబీ ర్యామ్‌/32జీబీ స్టోరేజ్‌, 4జీబీ ర్యామ్‌/64జీబీ స్టోరేజ్‌, 6జీబీ ర్యామ్‌/64జీబీ స్టోరేజ్‌ వేరియంట్లలో ఇది చైనా మార్కెట్‌లోకి వచ్చింది. 

నోకియా ఎక్స్‌6 స్పెషిఫికేషన్లు..
డ్యూయల్‌ సిమ్‌
ఆండ్రాయిడ్‌ 8.1 ఓరియో
5.8 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ ప్లస్‌ డిస్‌ప్లే
2.5డీ కార్నింగ్‌ గొర్రిల్లా గ్లాస్‌ 3 ప్రొటెక్షన్‌
ఆక్టాకోర్‌ స్నాప్‌డ్రాగన్‌ 636 ఎస్‌ఓసీ
16 ఎంపీ, 5 ఎంపీ సెన్సార్లతో వెనుక వైపు కెమెరా
16 ఎంపీ సెన్సార్‌తో ఫ్రంట్‌ కెమెరా
3060 ఎంఏహెచ్‌ బ్యాటరీ
 

మరిన్ని వార్తలు