వృద్ధి 5.7 శాతమే: నోమురా ఏప్రిల్‌–జూన్‌పై అంచనా

22 Aug, 2019 09:08 IST|Sakshi

  ఏప్రిల్‌–జూన్‌పై అంచనా

భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో కేవలం 5.7 శాతమే నమోదవుతుందని జపాన్‌ బ్రోకరేజ్‌ సంస్థ–  నోమురా అంచనావేసింది. వినియోగం పడిపోవడం, పెట్టుబడుల బలహీనత, సేవల రంగం పేలవంగా ఉండడం దీనికి కారణంగా పేర్కొంది. అయితే జూలై–సెప్టెంబర్‌ త్రైమాసికంలో వృద్ధి రేటు కొంత మెరుగుపడే అవకాశం ఉంటుందని సంస్థ అంచనావేసింది. మందగమన పరిస్థితులకు ఇక తొలగిపోతున్నట్లు సంకేతాలు అందుతున్నట్లు సంబంధిత ఇండికేటర్స్‌ సూచిస్తున్నట్లు తెలిపింది. 2018–19లో 6.8 శాతం వృద్ధి నమోదయిన సంగతి తెలిసిందే. ఆగస్టు 30వ తేదీన ఏప్రిల్‌–జూన్‌ త్రైమాసిక గణాంకాలు వెలువడనున్న సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు