ఐటీ శాఖ సంచలనం: కమిషనర్లకు షాక్‌

17 Jul, 2017 10:52 IST|Sakshi
ఐటీ శాఖ సంచలనం: కమిషనర్లకు షాక్‌

న్యూడిల్లీ: ఆదాయపు పన్నుశాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. ఐటీ విభాగంలో ఉన్నత అధికారుల బదిలీలతో భారీగా సంస్కరణకు  శ్రీకారం చుట్టింది. 'పనితీరు' మెరుగుగా లేని కమిషనర్లకు షాకిచ్చింది. ముఖ‍్యంగా పనితీరును పరిగణనలోకి తీసుకున్న  సంస్థ  దేశవ్యాప్తంగా ముఖ్యమైన స్థానాల్లో ఉన్న అధికారులను బదిలీ చేసింది. దీంతో ఇప్పటివరకు ఆదాయం పన్ను కమిషనర్లకు సంబంధించిన ఇది అతిపెద్ద మార్పుగా భావిస్తున్నారు.

డైరెక్ట్ టాక్స్ సెంట్రల్ బోర్డ్ , (సీబీడీటీ) లో దేశవ్యాప్తంగా 245 కమిషనర్లను  కీలక స్థానాలనుంచి   బదిలీ చేసిందని తాజా  నివేదికలు పేర్కొంటున్నాయి. సీబీడీటీలో నాన్‌-పెర్‌ఫామెన్స్‌ అధికారులతోపాటు, విజిలెన్స్ లేదా ఇతర క్రమశిక్షణా ఆరోపణలను ఎదుర్కొంటున్నవారిని, పదవిలో రెండు లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాల సర్వీసు  ఉన్న అధికారులకు స్థానభ్రంశం కల్పించింది. 

సీబీడీటీ చైర్మన్ సుశీల్ చంద్ర దేశవ్యాప్తంగా ఉన్న  ప్రాంతీయ ఐటి కార్యాలయాలకు రాసిన ఒక లేఖలో, ఈ సంవత్సరం తమ పన్ను పరిధిని గణనీయంగా విస్తరించడానికి, వారి అధికార పరిధిలోని ప్రాంతానికి  సంబంధించి స్పెషల్‌  ప్రొఫైల్కు అనుగుణంగా" ప్రాంతీయ వ్యూహాన్ని "అభివృద్ధి చేయాలని  కోరారు.

జూలై 12 న  ఉన్నత అధికారులకు జారీ చేసిన ప్రత్యేక నిర్దేశకత్వాల్లో వాణిజ్య సంస్థలు, మార్కెట్‌ సంస్థలు,  ఇతరుల ద్వారా సమాచారాన్ని సేకరించి పన్ను ఎగవేతదారులను గుర్తించాలని ఆదేశించింది. ప్రత్యేకించి టైర్ -2 మరియు 3 నగరాల్లో   పన్ను చెల్లింపులను ప్రోత్సహించే విధంగా  అవగాహన సమావేశాలు, ఔట్రీచ్ కార్యక్రమాలు నిర్వభహించనున్నామని  సీబీడీటీ చైర్మన్ తన లేఖలో పేర్కొన్నారు. అలాగే  ప్రజా సెషన్లను నిర్వహించాలని పన్ను అధికారులకు ఆయన సూచించారు.  జీఎస్‌టీ అమలుపై నెలవారీ నివేదికలను  సిద్ధం చేయాల్సిందిగా సీనియర్‌ అధికారులు, జోన్‌ల్‌ హెడ్‌లను కోరారు.

కాగా  గత ఆర్థిక సంవత్సరం పన్ను మినహాయింపులో 91లక్షల మంది కొత్త పన్ను చెల్లింపుదారులను ఆదాయపన్ను శాఖ గుర్తించింది. ముఖ్యంగా చిన్ననగరాల్లో  పన్ను చెల్లించగలిగి ఉండా కూడా తప్పించుకుంటున్నవారిని  గుర్తించింది. ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, పూణే  తదితర మరికొన్ని మెట్రో నగరాలతో పోల్చినపుడు టైర్ -2, టైర్ -3 నగరాలు జనాభా సాంద్రత , మానవ వనరులు కొద్దిగా తక్కువే.

మరిన్ని వార్తలు