పడిపోతున్న పొదుపు రేటు

16 Aug, 2018 00:34 IST|Sakshi

పెద్ద నోట్ల రద్దు, జీఎస్‌టీ ఎఫెక్ట్‌ 

ఇండియా రేటింగ్స్‌ నివేదిక 

ముంబై: పెద్ద నోట్ల రద్దు, వస్తు, సేవల పన్నుల (జీఎస్‌టీ) విధానం అమలు తదితర అంశాలతో దేశీయంగా పొదుపు రేటు గణనీయంగా తగ్గింది. ఇదే ధోరణి కొనసాగితే మొత్తం ఎకానమీ వృద్ధికి, స్థూల ఆర్థిక స్థిరత్వానికి పెను సవాలుగా మారనుంది. రేటింగ్‌ ఏజెన్సీ ఇండియా రేటింగ్స్‌ ఒక నివేదికలో ఈ అంశాలు వెల్లడించింది. 2012–2017 మధ్య కాలంలో పొదుపు రేటు 23.6% నుంచి 16.3 శాతానికి పడిపోయింది.

2017 ఆర్థిక సంవత్సరంలో కుటుంబాల పొదుపు రేటు 153 బేసిస్‌ పాయింట్లు, ప్రైవేట్‌ కార్పొరేషన్లది 12 బేసిస్‌ పాయింట్ల మేర క్షీణించింది. పొదుపులో సింహభాగం వాటా కుటుంబాలదే ఉంటున్నట్లు ఇండియా రేటింగ్స్‌ పేర్కొంది. లాభాపేక్ష లేని సంస్థలు, క్వాసీ–కార్పొరేట్‌ సంస్థల పొదుపు కూడా కుటుంబాల పొదుపులో భాగంగా పరిగణిస్తారు.

మరిన్ని వార్తలు