దేశంలో మొత్తం నోట్ల విలువ రూ.11.73 లక్షల కోట్లు

11 Mar, 2017 04:36 IST|Sakshi
దేశంలో మొత్తం నోట్ల విలువ రూ.11.73 లక్షల కోట్లు

న్యూఢిల్లీ: పెద్దనోట్లరద్దు తరువాత దేశంలో చలామణిలో ఉన్న మొత్తం నోట్ల విలువ రూ.11.73 లక్షల కోట్ల రూపాయలని శుక్రవారం పార్లమెంట్‌ ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరం మార్చి 31 నాటికి 16.41 లక్షలకోట్లు నోట్లు చలామణిలో ఉండగా, ఈ సంవత్సరం మార్చి 3 నాటికి నోట్ల విలువ 11.37లక్షలకోట్లుగా ఉందని కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్వాల్‌ పార్లమెంట్‌లో తెలియజేశారు. మార్కెట్‌లో నోట్ల ప్రవాహాం తగ్గడానికి పెద్ద నోట్ల రద్దు ప్రధాన కారణమని తెలిపారు.

దేశంలో 190 కోట్లు రూ.5 నాణేల రూపంలో, రూ.130 కోట్లు రూ.10 నాణేల రూపంలో; రూ.260 కోట్లు రూ.10 నోట్ల రూపంలో; రూ.360 కోట్లు రూ.20 నోట్ల రూపంలో ఉండగా, మిగతా మొత్తం ద్రవ్యం రూ.100, రూ.500, రూ.2 వేల రూపాయల నోట్ల రూపంలో ఉందని తెలిపారు. ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ రూ.500, రూ.2 వేల నోట్ల ముద్రణ ఖర్చు గురించి మాట్లాడుతూ ‘‘ఉద్యోగుల నైపుణ్యం, యంత్రాల సామర్థ్యాన్ని బట్టి ముద్రణ విలువ మారుతుంద’’న్నారు.

రూ.500 నోటు ముద్రణకు రూ.2.87నుంచి రూ.3.09ల ఖర్చుకాగా, రూ.2వేల నోటుకు రూ.3.54నుంచి రూ. 3.77లుగా ఖర్చు అవుతుందని తెలిపారు. దేశం మొత్తం మీద నాలుగు ముద్రణాలయాలు ఉండగా రెండు సెక్యూరిటీ ప్రింటింగ్‌ అండ్‌ మింటింగ్‌ కార్పోరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ ఆధ్వర్యంలో మరో రెండు భారతీయ రిజర్వ్‌ బ్యాంకు ఆధ్వర్యంలో ఉన్నాయి.

మరిన్ని వార్తలు