గూగుల్‌ కొత్త స్మార్ట్‌ఫోన్లను కొనాలనుకుంటున్నారా...

18 Oct, 2018 09:06 IST|Sakshi

సాఫ్ట్‌వేర్‌ దిగ్గజ సంస్థ గూగుల్‌ ప్రపంచ మార్కెట్లోకి తన కొత్త పిక్సెల్‌ స్మార్ట్‌ఫోన్లు ‘పిక్సెల్‌ 3’, ‘పిక్సెల్‌ 3 ఎక్స్‌ఎల్‌’ లను మార్కెట్‌లోకి విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ స్మార్ట్‌ఫోన్లను కొనాలని ఆసక్తి ఉన్న వారి కోసం, భారతీ ఎయిర్‌టెల్‌ తన ఆన్‌లైన్‌ స్టోర్‌లో ప్రీ-ఆర్డర్లను ప్రారంభించింది. బుధవారం నుంచి తన ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్‌లో గూగుల్‌ పిక్సెల్‌ స్మార్ట్‌ఫోన్ల ప్రీ-ఆర్డర్లను ప్రారంభించనున్నట్టు ప్రకటించింది. ఎవరైతే ఈ స్మార్ట్ ఫోన్లను కొనాలనుకున్నారో వారు డౌన్‌పేమెంట్లు కట్టి ఈఎంఐ ప్లాన్లలో వీటిని కొనుగోలు చేయొచ్చని తెలిపింది. ఈ స్మార్ట్‌ఫోన్లను కొనుగోలు చేసేటప్పుడే డేటా, కాలింగ్‌, కంటెంట్‌ ప్రయోజనాలతో కూడిన పోస్టుపెయిడ్‌ ప్లాన్‌ను కంపెనీ అందించనుంది.

గూగుల్‌ పిక్సెల్‌ 3, పిక్సెల్‌ 3ఎక్స్‌ఎల్‌(64జీబీ), పిక్సెల్‌ 3ఎక్స్‌ఎల్‌(128జీబీ) వేరియంట్ల డౌన్‌పేమెంట్లు రూ.17,000, రూ.20,000, రూ.29,000గా ఉన్నాయి. గూగుల్‌ పిక్సెల్‌ 3(64జీబీ) వేరియంట్‌ అసలు ధర రూ.71వేల రూపాయలు, గూగుల్‌ పిక్సెల్‌ 3(128జీబీ) వేరియంట్‌ ధర 80వేల రూపాయలుగా ఉంది. ఇక గూగుల్‌ పిక్సెల్‌ 3ఎక్స్‌ఎల్‌ 64జీబీ వేరియంట్‌ ధర రూ.83వేలు కాగ, 128జీబీ మోడల్‌ ధర రూ.92వేలుగా ఉంది. ఈ రెండు స్మార్ట్‌ఫోన్లు 8ఎంపీ+8ఎంపీ ఫ్రంట్‌ ఫేసింగ్‌ కెమెరాలు, వెనుకవైపు 12.2 ఎంపీ సింగిల్‌ సెన్సార్‌తో మార్కెట్‌లోకి వచ్చింది. ఎక్స్‌క్లూజివ్‌ ఇన్‌-కెమెరా గూగుల్‌ లెన్స్‌ను ఇది కలిగి ఉంది. 

మరిన్ని వార్తలు