‘మొండి’ భారం రెట్టింపు...

19 Aug, 2016 01:16 IST|Sakshi
‘మొండి’ భారం రెట్టింపు...

కేర్ రేటింగ్స్ వెల్లడి
ముంబై: బ్యాంక్‌ల మొండి బకాయిలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలంలో దాదాపు రెట్టింపై 8.5 శాతానికి చేరాయని ప్రముఖ రేటింగ్ సంస్థ, కేర్ రేటింగ్స్ తాజా నివేదిక తెలిపింది. ప్రభుత్వ రంగ బ్యాంక్‌ల మొండి బకాయిలు భారీగా ఉండడమే దీనికి కారణమంటున్న ఈ నివేదికలో కొన్ని ముఖ్యాంశాలు చూస్తే..,

గత ఆర్థిక సంవత్సరం క్యూ1లో 4.6 శాతంగా ఉన్న బ్యాంక్‌ల మొండి బకాయిలు ఈ క్యూ1లో 8.5 శాతానికి పెరిగాయి.

గత క్యూ1లో 5.3 శాతంగా ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంక్‌ల మొండి బకాయిలు ఈ క్యూ1లో 10.4 శాతానికి ఎగిశాయి. మరో ఆరు నెలల పాటు ప్రభుత్వ రంగ బ్యాంక్‌లకు మొండి బకాయిలు, వాటికి కేటాయింపుల సమస్యలు తప్పవు. ఫలితంగా వాటా లాభదాయకత దెబ్బతింటుంది.

{పైవేట్ బ్యాంక్‌లు కొంత నయంగా ఉన్నాయి. గత క్యూ1లో 2.1%గా ఉన్న ప్రైవేట్ బ్యాంక్‌ల మొండి బకాయిలు ఈ క్యూ1లో 3%కి పెరిగాయి.

మొండి బకాయిల కారణంగా పలు ప్రభుత్వ రంగ బ్యాంక్‌లు భారీ నష్టాలను ప్రకటించాయి.

బకాయిలను గుర్తించి వాటికి కేటాయింపులు జరపడం దీర్ఘకాలంలో మంచి ఫలితాలను ఇచ్చే చర్య. పోటీని తట్టుకోవడానికి తగిన సన్నద్ధతను ఇవ్వడానికి బ్యాంక్‌లకు ఈ చర్య ఉపకరిస్తుంది.

మరిన్ని వార్తలు