వార్షికంగా రూ.1,000 జమ చేస్తే చాలు..

16 Aug, 2016 02:50 IST|Sakshi
వార్షికంగా రూ.1,000 జమ చేస్తే చాలు..

ఎన్‌పీఎస్ ఖాతా పనిచేస్తుంది: పీఎఫ్‌ఆర్‌డీఏ
న్యూఢిల్లీ: నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్‌పీఎస్)లో మరింత మందిని భాగస్వాములను చేయడమే లక్ష్యంగా పెన్షన్ ఫండ్ రెగ్యులేటర్ ‘పీఎఫ్‌ఆర్‌డీఏ’ తాజాగా కొత్త నిర్ణయం తీసుకుంది. టైర్-1 ఖాతాలలో ఏడాదికి కనీసం రూ.1,000లు జమ చేస్తే ఆ అకౌంట్ కొనసాగుతుంది. ఈ మొత్తం ఇదివరకు రూ.6,000గా ఉంది. కనీస నిల్వ లేని కారణంగా స్తంభింపజేసిన ఖాతాలను తిరిగి క్రియాత్మకం చేయాలని కూడా పీఎఫ్‌ఆర్‌డీఏ నిర్ణయించింది.

దీంతో గతంలో నిలిచిపోయిన ఖాతాలలో వినియోగదారులు తిరిగి డబ్బుల్ని జమచేసి యాక్టివేట్ చేసుకోవచ్చు. ఎన్‌పీఎస్‌లో టైర్-1, టైర్-2 అనే రెండు రకాల ఖాతాలు ఉన్నాయి. టైర్-1 అనేది నాన్ విత్ డ్రాయల్ పర్మనెంట్ రిటైర్‌మెంట్ అకౌంట్. ఇక టైర్-2 అనేది వాలంటరీ విత్‌డ్రాయల్ అకౌంట్. ఎన్‌పీఎస్‌లో భాగస్వాములు కావాలనుకునే ప్రతి ఒక్కరికి టైర్-1 అకౌంట్ తప్పనిసరి. టైర్-2 మన ఇష్టం.

మరిన్ని వార్తలు