ఎన్టీపీసీ లాభం 18 శాతం డౌన్

29 Oct, 2016 00:44 IST|Sakshi
ఎన్టీపీసీ లాభం 18 శాతం డౌన్

రూ.2,496 కోట్లుగా నమోదు
న్యూఢిల్లీ : ఎన్‌టీపీసీ స్టాండెలోన్ నికర లాభం సెప్టెంబర్ త్రైమాసికంలో 18 శాతం క్షీణించింది. రూ.2,496 కోట్ల లాభాన్ని కంపెనీ ఆర్జించింది. గతేడాది ఇదే కాలంలో లాభం రూ.3,029 కోట్లు. మొత్తం ఆదాయం మాత్రం రూ.18,218 కోట్ల నుంచి రూ.19,588 కోట్లకు పెరిగింది. అయితే, గతేడాది సెప్టెంబర్ త్రైమాసికంలో రిఫండ్‌లకు తోడు పన్నుపరమైన సర్దుబాట్ల వల్ల ఎక్కువ లాభం వచ్చినట్టు కంపెనీ తెలిపింది. విద్యుదుత్పత్తి ద్వారా వచ్చే ఆదాయం రూ.17,993 కోట్ల నుంచి రూ.19,491 కోట్లకు పెరిగింది. స్థూల విద్యుత్ ఉత్పత్తి 60.59 బిలియన్ యూనిట్లుగా ఉంది. సగటున ఒక్కో యూనిట్‌పై చార్జీ రూ.3.25గా ఉన్నట్టు కంపెనీ తెలిపింది.

మరిన్ని వార్తలు