13.28 కోట్ల పాన్‌కార్డులు ..

6 Nov, 2017 20:25 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ:   ఇప్పటి వరకూ 13.28 కోట్ల శాశ్వత ఖాతా నంబర్లు (పాన్‌ ) కార్డ్‌ తో ఆధార్‌ నంబర్ల అనుసంధానం జరిగిందని కేంద్ర ప్రకటించింది.  దీంతో ప్యాన్‌తో ఆధార్‌  లింకింగ్‌ ప్రక్రియలో  39.5 శాతం కార్డుల  అనుసంధానం పూర్తయిందని  అధికారిక వర్గాలు సోమవారం ప్రకటించాయి.  సుమారు 33 కోట్ల పాన్ కార్డులు ఉండగా,  ఆధార్ 115 కోట్ల మందికి ఆధార్‌  కార్డులను జారీ చేసినట్టు వెల్లడించాయి. 

జూలై 1 నుంచి  ఐటీఆర్ ( ఆదాయన పన్ను టర్న్) దాఖలు కు పాన్-ఆధార్‌  అనుసంధానం  తప్పనిసరి అని ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఆదాయపు పన్ను చట్టం నిబంధనపై  జూన్ నెలలో సుప్రీంకోర్టు సమర్థించింది అయితే గోపత్య అంశంపై రాజ్యాంగ ధర్మాసనం తుది  తీర్పు వరకు ఈ ఆదేశాల అమలుపై పాక్షింగా స్టే విధించింది.  అలాగే ఆధార్‌కార్డుకోసం నమోదు చేసుకున్న  వారి పాన్‌ కార్డులు రద్దు కావని ప్రకటించిన సంగతి తెలిసిందే. 

 

>
మరిన్ని వార్తలు