బీఎస్‌ఎన్‌ఎల్‌కు మారుతున్న యూజర్లు...

22 Nov, 2019 06:44 IST|Sakshi

మొబైల్‌ నంబర్‌ పోర్టబిలిటీ (ఎంఎన్‌పీ) కారణంగా ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌ నుంచి ఇతర నెట్‌వర్క్‌లకు మారే వారి కన్నా.. వేరే ఆపరేటర్ల నుంచి బీఎస్‌ఎన్‌ఎల్‌కు మారే వారి సంఖ్యే ఎక్కువగా ఉంటోంది. 2018–19లో పోర్ట్‌–అవుట్స్‌ సంఖ్య (వేరే ఆపరేటర్‌కు మారినవారు) 28.27 లక్షలుగా ఉండగా, పోర్ట్‌–ఇన్స్‌ (బీఎస్‌ఎన్‌ఎల్‌కు మారిన వారు) 53.64 లక్షలుగా ఉంది. మొత్తం మీద 2019 అక్టోబర్‌ దాకా 2.04 కోట్ల మేర పోర్ట్‌–ఇన్స్‌ ఉండగా, 1.80 కోట్ల మేర పోర్ట్‌–అవుట్స్‌ ఉన్నాయి. ఆగస్టు 31 నాటికి బీఎస్‌ఎన్‌ఎల్‌ మొబైల్‌ కనెక్షన్ల సంఖ్య 11.64 కోట్లుగా ఉన్నట్లు కేంద్ర టెలికం మంత్రి రవి శంకర్‌ ప్రసాద్‌ లోక్‌సభలో తెలిపారు. 

>
మరిన్ని వార్తలు