ఓబీసీ డిపాజిట్ రేట్లు పెరిగాయ్

4 Mar, 2014 01:52 IST|Sakshi
ఓబీసీ డిపాజిట్ రేట్లు పెరిగాయ్

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్(ఓబీసీ) డిపాజిట్ రేట్లను పెంచుతున్నట్లు సోమవారం ప్రకటించింది. 3 విభిన్న కాలవ్యవధులున్న డిపాజిట్లపై 3.25 శాతం వరకూ వడ్డీరేట్లను పెంచింది. కొత్త రేట్లు నేటి(మంగళవారం) నుంచి అమల్లోకి రానున్నాయని బ్యాంక్   పేర్కొంది. తాజా చర్యలతో 31-45 రోజుల వ్యవధిగల డిపాజిట్లపై వడ్డీరేటు ఇప్పుడున్న 6% నుంచి 9.25%కి పెరిగింది. 46-90 రోజుల డిపాజిట్లపై 8.5% నుంచి 9.5%కి; 91-179 రోజుల డిపాజిట్లపై 8.75% 9.75%కి రేట్లను పెంచినట్లు వెల్లడించింది.
 అలహాబాద్ బ్యాంక్ బేస్‌రేటు కూడా..: అలహాబాద్ బ్యాంక్ కనీస రుణ రేటు(బేస్ రేటు) 0.05 శాతం పెరుగుదలతో 10.25 శాతానికి చేరింది. దీంతో గృహ, వాహన రుణాలతో సహా అన్ని కొత్త రుణాలపై వడ్డీరేట్లు పెరగనున్నాయి. కొత్త రేట్లు నేటి నుంచి అమల్లోకి రానున్నాయి.

 దేనా బ్యాంకు ఎఫ్‌సీఎన్‌ఆర్ రేట్ల సవరణ..
 ఎఫ్‌సీఎన్‌ఆర్(ఫారిన్ కరెన్సీ నాన్-రిపాట్రియబుల్) (బి), ఆర్‌ఎఫ్‌సీ టర్మ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను దేనా బ్యాంక్ సవరించింది. దీని ప్రకారం ఏడాది నుంచి రెండేళ్ల దాకా వ్యవధి ఉండే డిపాజిట్లపై వడ్డీ రేటును 2.57 శాతం నుంచి 2.55 శాతానికి, 4 నుంచి 5 ఏళ్ల దాకా డిపాజిట్లపై 5.24 శాతం నుంచి 4.23 శాతానికి తగ్గించింది. 

మరిన్ని వార్తలు