ఓబీసీకి తగ్గిన ‘మొండి’ భారం 

23 Oct, 2019 02:48 IST|Sakshi

24 శాతం వృద్ధితో రూ.126 కోట్లకు నికర లాభం 

న్యూఢిల్లీ: ఓరియంటల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ కామర్స్‌ (ఓబీసీ) ఈ ఆర్థిక  సంవత్సరం రెండో త్రైమాసిక కాంలో రూ.126 కోట్ల నికర లాభం సాధించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో సాధించిన నికర లాభం(రూ.102 కోట్లు)తో పోల్చితే  24 శాతం వృద్ధి సాధించామని ఓరియంటల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ కామర్స్‌(ఓబీసీ) తెలిపింది.

మొత్తం ఆదాయం రూ.4,967 కోట్ల నుంచి 15 శాతం వృద్ధితో రూ.5,702 కోట్లకు పెరిగిందని పేర్కొంది. నికర మొండి బకాయిలు 10.07 శాతం నుంచి 5.94 శాతానికి తగ్గాయని తెలిపింది. రుణ నాణ్యత మెరుగుపడటంతో బీఎస్‌ఈలో ఓబీసీ షేర్‌ 1.4 శాతం లాభంతో రూ.50 వద్ద ముగిసింది.    

మరిన్ని వార్తలు