ఆన్‌లైన్‌లో పూజ.. ఇంటికి ప్రసాదం! 

9 Mar, 2019 00:22 IST|Sakshi

మై మందిర్‌లో  300 ఆలయాల నమోదు

50 లక్షల మంది యూజర్లు; తెలుగు రాష్ట్రాల వాటా 30 శాతం

ఆధ్యాత్మిక సమాచారం, ఫొటోలు, వీడియో కంటెంట్‌

‘స్టార్టప్‌ డైరీ’తో  ఫౌండర్‌ రాహుల్‌ గుప్తా  

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: మనం గుడికి వెళితే అర్చన చేయిస్తాం. పేరు, గోత్రం పూజారికి చెబితే.. వేద మంత్రాలు చదువుతూ మన పేరిట అర్చన చేసేస్తాడు! ఈ సందర్భాన్ని కొద్దిగా మార్చేసింది మై మందిర్‌ స్టార్టప్‌. గుడికి స్వయంగా వెళ్లి అర్చన చేయించే బదులు.. మనం ఇంట్లోనే ఉండి మన పేరిట పూజారి అర్చన చేస్తే? పూజ పూర్తయ్యాక ప్రసాదమూ ఇంటికి పంపిస్తే...? ఇదిగో... ఈ సేవలనే అందిస్తోంది బెంగళూరుకు చెందిన స్టార్టప్‌ మై మందిర్‌! మరిన్ని వివరాలు ఫౌండర్‌ అండ్‌ సీఈఓ రాహుల్‌ గుప్తా ‘స్టార్టప్‌ డైరీ’తో పంచుకున్నారు.  ‘‘మాది ఉత్తర్‌ ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌. ఐఐటీ ముంబైలో ఇంజనీరింగ్‌ పూర్తయ్యాక.. ఆక్స్‌వర్డ్‌ యూనివర్సిటీలో ఎంబీఏ చేశా. ఆ తర్వాత పదిహేనేళ్ల పాటు వివిధ స్టార్టప్‌ కంపెనీల్లో పనిచేశా.  2016 అక్టోబర్‌లో రూ.10 లక్షల పెట్టుబడితో బెంగళూరు కేంద్రంగా మై మందిర్‌. కామ్‌ను ప్రారం భిం చాం. మై మందిర్‌ అనేది ఒక ఆధ్యాత్మిక సామాజిక మాధ్యమం. దేశం లోని అన్ని దేవాలయా లు, గోపురాలు, వాటి ప్రాశస్త్యం, పూజలు ఇతర వివరాలుంటాయి. రిజిస్టర్‌ అయిన భక్తులు ఆధ్యాత్మిక సమాచారం, ఫొటోలు, వీడియోలను షేర్‌ చేసుకోవచ్చు.  

300లకు పైగా ఆలయాల నమోదు.. 
ప్రస్తుతం మై మందిర్‌కు ఇస్కాన్, అలంపూర్‌ జోగుళాంబ, పిల్లలమర్రి శివాలయం, బాలత్రిపుర సుందరి పీఠం వంటి 300కు పైగా దేవాలయాలు, స్థానిక పూజారులతో ఒప్పందం ఉంది. ఆయా ఆలయాల్లో అర్చనలు, ప్రత్యేక పూజలు, అన్నదానం వంటి అన్ని రకాల కార్యక్రమాలను నిర్వహించవచ్చు. వీటి ధరలు పూజను బట్టి రూ.600 నుంచి రూ.10 వేల వరకున్నాయి. ఆన్‌లైన్‌లో జాతకచక్ర సేవలు కూడా ఉన్నాయి. వీటి ధరలు రూ.99 నుంచి రూ.211 వరకున్నాయి. 

ప్రవచనాల ప్రసారం కూడా.. 
దేవీ చిత్రలేఖ, కృష్ణ ప్రియ జీ, దేవీ నిధినేహా, సాధ్వి భవ్యశ్రీ, ప్రమోద్‌ కుమార్, రాధే ప్రియ, బాలాజీ స్వామి వంటి ప్రముఖ వందకు పైగా ఆధ్యాత్మిక బోధకులు కూడా మై మందిర్‌లో నమోదయ్యారు. దీంతో ఆయా బోధకుల భజనలు, ప్రవచనాలు, పురాణాలు, గ్రంథాలు, పంచాంగ శ్రవణం వంటి అన్ని రకాల కార్యక్రమాలు ప్రసారమవుతాయి. 

ఏడాదిలో కోటి మందికి.. 
తెలుగు, హిందీ, కన్నడం, మలయాళం, తమిళం, మరాఠీ, గుజరాతీ, బంగ్లా, ఒరియా భాషల్లో మా సేవలు అందుబాటులో ఉన్నాయి. ఏడాదిలో అన్ని భారతీయ భాషల్లోకి విస్తరిస్తాం. ప్రస్తుతం మై మందిర్‌లో 50 లక్షల మంది యూజర్లున్నారు. ఇందులో 30% వాటా తెలుగు రాష్ట్రాల నుంచి ఉంటుంది. రోజుకు లక్ష ఫొటోలు, వీడియోలు అప్‌లోడ్‌ అవుతున్నాయి. ఏడాదిలో కోటి మంది కస్టమర్లకు చేరుకోవాలని లకి‡్ష్యంచాం. ప్రస్తుతం మా కంపెనీలో 25 మంది ఉద్యోగులున్నారు. నిధుల సమీకరణ కోసం చూస్తున్నాం’’ అని వివరించారు.  

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

విప్రో లాభం 2,388 కోట్లు

దిగ్గజ స్టార్టప్‌కు ప్రేమ్‌జీ ఊతం

అజీం ప్రేమ్‌జీ అండతో ఆ స్టార్టప్‌ అరుదైన ఘనత

కార్పొరేట్‌ బ్రదర్స్‌ : అనిల్‌ అంబానీకి భారీ ఊరట

లాభాల్లోకి మార్కెట్లు : బ్యాంక్స్‌ జూమ్‌

రెడ్‌మి కే 20 ప్రొ వచ్చేసింది

రెడ్‌మి కే20 ప్రొ స్మార్ట్‌ఫోన్‌ : బిగ్‌ సర్‌ప్రైజ్‌

స్వల్ప లాభాలతో స్టాక్‌మార్కెట్లు

మార్కెట్లోకి ‘స్కోడా రాపిడ్‌’ లిమిటెడ్‌ ఎడిషన్‌

‘ఐటీఆర్‌ ఫామ్స్‌’లో మార్పుల్లేవ్‌..

ఇక ‘స్మార్ట్‌’ మహీంద్రా!

సు‘జలం’ @ 18.9 లక్షల కోట్లు!

విప్రోకు ఉజ్వల భవిష్యత్‌: ప్రేమ్‌జీ

ప్రైమ్‌ డే సేల్ ‌: అమెజాన్‌కు షాక్‌

నేటి నుంచీ కియా ‘సెల్టోస్‌’ బుకింగ్స్‌ ప్రారంభం

ఎక్కడైనా వైఫై కనెక్టివిటీ !

అశోక్‌ లేలాండ్‌ ప్లాంట్‌ తాత్కాలిక మూసివేత

కొనుగోళ్ల జోష్‌ : లాభాల్లోకి సూచీలు 

ఎయిరిండియాకు భారీ ఊరట

ఫ్లాట్‌గా స్టాక్‌మార్కెట్లు

మందగమనానికి ఆనవాలు!

27 ఏళ్ల కనిష్టానికి చైనా వృద్ధి రేటు

జీవీకే ఎయిర్‌పోర్టులో 49% వాటా విక్రయం!

మార్కెట్లో ‘వాటా’ ముసలం!

మహిళల ముంగిట్లో డిజిటల్‌ సేవలు : జియో

బడ్జెట్‌ ధరలో రియల్‌మి 3ఐ

అద్భుత ఫీచర్లతో రియల్‌ మి ఎక్స్‌ లాంచ్‌

లాభనష్టాల ఊగిసలాట

రెండేళ్ల కనిష్టానికి టోకు ధ‌ర‌ల ద్ర‌వ్యోల్బ‌ణం

16 పైసలు ఎగిసిన రూపాయి

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

తమిళ ఆటకు రానా నిర్మాత

నా ఫిట్‌నెస్‌ గురువు తనే

మిస్‌ ఫిజియో

చాలామందికి నా పేరు తెలియదు

ఇదొక అందమైన ప్రయాణం

నవ్వుల నవాబ్‌