చమురు ధరలు భారీ పతనం..

9 Mar, 2020 10:13 IST|Sakshi

న్యూఢిల్లీ : కరోనా ప్రభావం స్టాక్‌మార్కెట్ల నుంచి ముడిచమురు సహా కమాడిటీ వరకూ అన్ని మార్కెట్లనూ బెంబేలెత్తిస్తోంది. చమురు ధరలు ఆసియాలో సోమవారం 20 ఏళ్ల కనిష్టస్ధాయిలో ఏకంగా 30 శాతం పడిపోయాయి. డెడ్లీ వైరస్‌తో డిమాండ్‌ పడిపోవడంతో ఉత్పత్తిలో కోత విధించాలనే ఒప్పందంపై ఒపెక్‌, భాగస్వామ్య దేశాల మధ్య భేదాభిప్రాయాలతో సౌదీ అరేబియా ధరలను అమాంతం తగ్గించివేసింది. చమురు ఉత్పత్తిని తగ్గించడంపై ఒపెక్‌ దేశాలు, రష్యా మధ్య జరిగిన చర్చలు విఫలమైన అనంతరం సౌదీ ఆరాంకో ధరలను భారీగా తగ్గించింది.  సౌదీ ప్రైస్‌ వార్‌తో ఆసియాలో బ్యాంరెల్‌ ముడిచమురు ధర ఏకంగా 32 డాలర్లకు పడిపోయింది. కరోనా షాక్‌తో ఆర్థిక వృద్ధి తగ్గుముఖం పట్టే క్రమంలో రానున్న నెలల్లోనూ ముడిచమురు ధరలు దిగివస్తాయని మార్కెట్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు.

చదవండి : కేజీ బేసిన్‌లో అడుగంటిన క్రూడాయిల్‌

మరిన్ని వార్తలు