ఆయిల్ ఇండియా లాభం 26% డౌన్

29 May, 2014 01:46 IST|Sakshi
ఆయిల్ ఇండియా లాభం 26% డౌన్

న్యూఢిల్లీ: గతేడాది(2013-14) క్యూ4(జనవరి-మార్చి)లో ప్రభుత్వ రంగ దిగ్గజం ఆయిల్ ఇండియా నికర లాభం 26% క్షీణించి రూ. 566 కోట్లకు పరిమితమైంది. అంతక్రితం ఏడాది(2012-13) ఇదే కాలంలో రూ. 765 కోట్లను ఆర్జించింది. ఉత్పత్తి మందగించడం, సబ్సిడీ చెల్లింపులు పెరగడం లాభాలను ప్రభావితం చేసినట్లు కంపెనీ తెలిపింది. సబ్సిడీ చెల్లింపులు రూ. 1,850 కోట్ల నుంచి రూ. 2,348 కోట్లకు ఎగశాయి.

ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు డీజిల్, వంటగ్యాస్ విక్రయాలవల్ల వాటిల్లే ఆదా య నష్టాలకుగాను ఆయి ల్ ఉత్పత్తి సంస్థలు 48% వరకూ సబ్సిడీలు చెల్లిస్తాయి. ముడిచమురు ఉత్పత్తికిగాను బ్యారల్‌కు 106.55 డాలర్ల చొప్పున బిల్లింగ్ చేసినప్పటికీ, 69.19 డాలర్లమేర సబ్సిడీ ఇవ్వడంతో నికరంగా 37.36 డాలర్లు మాత్రమే లభించినట్లు కంపెనీ వివరించింది. గతంలో బ్యారల్‌కు 56 డాలర్ల సబ్సిడీ ఇచ్చినప్పటికీ నికరంగా 55.44 డాలర్లు ఆర్జించినట్లు తెలిపింది.

మరిన్ని వార్తలు