సంక్షోభం : బాటిల్ కోక్ కంటే..చౌక

21 Apr, 2020 13:18 IST|Sakshi

ముడి చమురు ధరల పతనంపై నీతి ఆయోగ్ సీఈవో  ట్వీట్

ఇలాంటి సంక్షోభాన్ని జీవితంలో చూస్తాననుకోలేదు-   అమితాబ్ కాంత్

సాక్షి, న్యూఢిల్లీ: అమెరికా ముడి చమురు ధరల రికార్డు పతనంపై నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ దిగ్భ్రాంతి  వ్యక్తం చేశారు. కరోనా వైరస్ లాంటి మహమ్మారిని, చమురు ధరల్లో ఇంతటి పతనాన్ని తన జీవితం కాలంలో చూడాల్సి వస్తుందని ఊహించలేదని ట్వీట్ చేశారు. అంతేకాదు ఇపుడు కోక్ బాటిల్ కంటే.. చమురు చౌక అయి పోయిందని వ్యాఖ్యానించారు.   (ముడి చమురు ధర రికార్డు  పతనం)

కాగా అమెరికా డబ్ల్యుటీఐ ముడి చమురు సోమవారం మైనస్  లోకి పడిపోయిన సంగతి తెలిసిందే. కరోనావైరస్ సంక్షోభం, లాక్‌డౌన్‌ సమయంలో భారీగా క్షీణించిన డిమాండ్, పేరుకు పోయిన చమురు నిల్వలతో ఉత్తర అమెరికా చమురు ఉత్పత్తిదారులు చమురు నిల్వ చేయడానికి స్థలం లేకుండా పోయింది. దీంతో అధిక మొత్తంలో చమురు తీసుకోవటానికి కొనుగోలుదారులకు చెల్లించవలసి వచ్చింది. ప్రస్తుతం కాస్త తెప్పరిల్లిన  ముడి చమురు ప్రస్తుతం బ్యారెల్కు 1.450 డాలర్ల ధర వద్ద వుంది.  (క్రూడ్‌ క్రాష్‌..)

చదవండి : ఆల్ టైం కనిష్టానికి రూపాయి
కరోనా : నడిచి..నడిచి..ఇంటికి చేరబోతుండగా

మరిన్ని వార్తలు