మూడు నెలల గరిష్టానికి చమురు

3 Jun, 2020 12:54 IST|Sakshi

బుధవారం చమురు ధరలు మూడు నెలల గరిష్టానికి చేరాయి. కోవిడ్‌ మహమ్మారి నుంచి ఇప్పుడిప్పుడే ప్రపంచం నెమ్మదిగా కోలుకుంటుండడం, ప్రధాన ఆయిల్‌ ఉత్పత్తి దారులు ప్రొడక‌్షన్‌లో కోతవిధిస్తారని ఇన్వెస్టర్లు భావిస్తుండడంతో చమురు ధరలు మూడు నెలల గరిష్ట స్థాయికి పెరిగాయి. బ్రెంట్‌ క్రూడ్‌ 1 శాతం పెరిగి 39.79 డాలర్ల ట్రేడ్‌ అవుతోంది.మార్చి 6 తరువాత ఇది గరిష్టం కాగా, నిన్న(మంగళవారం) 3.3శాతం పెరిగింది.అమెరికా టెక్సాస్‌ ఇంటర్‌మీడియట్‌ క్రూడ్‌(డబ్ల్యూటీఐ) కూడా 1 శాతం పెరిగి 37.14 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. మార్చి6 తరువాత గరిష్టస్థాయికి చేరుకోవడం ఇదే తొలిసారి. కాగా డబ్ల్యూటీఐ మంగళవారం 4 శాతం పెరిగింది. వైరస్‌ పుట్టిన చైనాలో పరిశ్రమలు తిరిగి తెరుచుకోవడంతో  బెంచ్‌మార్క్‌లు ఏప్రిల్‌ కనిష్టాలనుంచి పుంజుకుని రెండు వారాలుగా ర్యాలీ చేస్తున్నాయి. ఇతర ఆర్థిక వ్యవస్థలు సైతం నెమ్మదిగా ప్రారంభమతున్నాయి .దీంతో ఆయిల్‌కు డిమాండ్‌ పెరగవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.  ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ ది పెట్రోలియం ఎక్సోపోర్టింగ్‌ కంట్రీస్‌(ఒపెక్‌), రష్యాలు  ప్రపంచ ఉత్పత్తిలో 10 శాతానికి సమానమై రోజుకి 9.7 మిలియన్ల బ్యారెల్‌ ఉత్పత్తి కోతను  జూలై, ఆగస్టు వరకు పొడిగించవచ్చని తెలుస్తోంది. క్రూడ్‌ ఉత్పత్తిలో కోతలపై ఒపెక్‌తో పాటు వివిధ దేశాలు గురువారం ఆన్‌లైన్‌ సమావేశాన్ని నిర్వహించనున్నాయి. ప్రస్తుతం ఉత్పత్తి కోతలు మే నుంచి జూన్‌ వరకు కొనసాగే అవకాశం ఉంది. జూలై నుంచి డిసెంబర్‌ మధ్యలో  కోతలను 7.7 మిలియన్ల బీపీడి తగ్గించవచ్చని భావిస్తున్నారు. కానీ సౌదీ అరేబియా మాత్రం మరికొంత ఎక్కువ కాలం కోత విధించాలని భావిస్తోంది. 

Related Tweets
మరిన్ని వార్తలు