నాలుగోరోజూ చమురు జోరు!

19 May, 2020 13:03 IST|Sakshi

మంగళవారం కూడా అంతర్జాతీయ మార్కెట్లలో చమురు ధరలు పెరిగాయి. ఉత్పత్తిదారులు చమురు ఉత్పత్తిలో మరిన్ని కోతలు విధించే ఛాన్సులున్నాయన్న వార్తలు, కరోనా కారక లాక్‌డౌన్‌ క్రమంగా దేశాలు ఎత్తివేయడంతో అంతర్జాతీయంగా డిమాండ్‌ ఊపందుకుకోవడం.. చమురు ధరలపై పాజిటివ్‌ ప్రభావం చూపాయి. దీంతో బ్రెంట్‌ క్రూడ్‌ ధర దాదాపు 2.4 శాతం లాభంతో 35.66 డాలర్ల వద్ద ఓపెనైంది. డబ్యు‍్లటీఐ క్రూడ్‌ దాదాపు 4 శాతం లాభపడింది. జూన్‌ కాంట్రాక్టులు ఈ మంగళవారం ఎక్స్‌పైరీ కానున్నాయి. గత నెల్లో జరిగినట్లు ఈ దఫా కూడా నెగిటివ్‌ జోన్‌లోకి ఫ్యూచర్లు జారతాయని కొందరు భయపడినా, అవి నిజం కాలేదు. ఒపెక్‌, రష్యాలు చమరు ఉత్పత్తిని తగ్గించేందుకు అంగీకరించిన సంకేతాలు వెలువడ్డాయి. ఈ దేశాలన్నీ తమ చమురు ఎగుమతులను మే మొదటి భాగంలో తగ్గించుకున్నాయి. తాజా కోతలతో క్రమంగా చమురుకు డిమాండ్‌ మరింత పెరగవచ్చన్న అంచనాలున్నాయి. దీంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ పాజిటివ్‌గా మారిందని ఆయిల్‌ నిపుణులు విశ్లేషించారు. మరోవైపు యూఎస్‌ఉత్పత్తి కూడా తగ్గుతూ వస్తోంది. జూన్‌నాటికి యూఎస్‌ఉత్పత్తి 2018 కనిష్ఠాలకు వస్తుందని అంచనాలున్నాయి. దీంతో చమురు ధరలకు అప్‌మూవ్‌ చూపాయి. 

>
మరిన్ని వార్తలు