లాభాల స్వీకరణ.. నష్టాలు

8 Jul, 2015 00:41 IST|Sakshi
లాభాల స్వీకరణ.. నష్టాలు

రెండు ట్రేడింగ్ సెషన్‌ల స్టాక్ మార్కెట్ లాభాలకు మంగళవారం బ్రేక్‌పడింది. ఆద్యంతం ఒడిదుడుకులమయంగా సాగిన  ట్రేడింగ్‌లో  బ్లూచిప్ షేర్లలో లాభాల స్వీకరణ కారణంగా బీఎస్‌ఈ సెన్సెక్స్ 37 పాయింట్ల నష్టంతో 28,172 పాయింట్ల వద్ద, నిఫ్టీ 11 పాయింట్లు నష్టపోయి 8,511 పాయింట్ల వద్ద ముగిశాయి. ఆయిల్, ఎఫ్‌ఎంసీజీ, లోహ, వాహన షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి.

 పదివారాల గరిష్ట స్థాయిని తాకి...
 లాభాల్లోనే ప్రారంభమైన సెన్సెక్స్ కొనుగోళ్ల మద్దతుతో ఇంట్రాడేలో 28,335 పాయింట్ల గరిష్ట స్థాయికి చేరింది. ఇది పదివారాల గరిష్ట స్థాయి. ఆ తర్వాత లాభాల స్వీకరణ చోటుచేసుకోవడంతో 28,084 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. వర్షాలు సాధరణం కంటే ఎక్కువ స్థాయిలోనే కురుస్తుండటంతో ఆర్‌బీఐ కీలక రేట్లను తగ్గిస్తుందన్న అంచనాలతో విదేశీ ఇన్వెస్టర్లు జోరుగా కొనుగోళ్లు జరిపారని, గ్రీస్ రుణ సంక్షోభాన్ని పట్టించుకోలేదని బ్రోకర్లు చెప్పారు.

 చమురు లాభాలు...వర్షాలు సాధారణం కంటే ఎక్కువ స్థాయిలో కురుస్తుండటంతో రేట్ల కోత ఉండొచ్చన్న అంచనాలతో బ్యాంక్ షేర్లు లాభాల బాటలో సాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు తగ్గడంతో పెయింట్, టైర్, విమానయాన, ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల షేర్లు పెరిగాయి. ఏషియన్ పెయింట్స్, శాలిమర్ పెయింట్స్, కన్సాయ్ నెరోలాక్ పెయింట్స్, జెట్ ఎయిర్‌వేస్, స్పైస్‌జెట్, అపోలో టైర్స్ షేర్లు 5-8 శాతం రేంజ్‌లో పెరిగాయి. బీపీసీఎల్, ఐఓసీ, హెచ్‌పీసీఎల్ షేర్లు 0.1 శాతం నుంచి 3 శాతం రేంజ్‌లో పెరిగాయి. కోల్ ఇండియాతో సహా 143 షేర్లు బీఎస్‌ఈలో ఏడాది గరిష్ట స్థాయిని తాకాయి.

మరిన్ని వార్తలు