పెట్టుబడులపై టాస్క్‌ఫోర్స్‌ దృష్టి..

11 Sep, 2019 09:17 IST|Sakshi

నివేదిక వచ్చాక కేంద్రం నుంచి నిధులు

మరో ఒకటి రెండు ఉద్దీపనలు

ఆరి్థక మంత్రి నిర్మలా సీతారామన్‌

చెన్నై: మౌలికరంగ ప్రాజెక్టుల్లోకి పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన టాస్‌్కఫోర్స్‌.. కేంద్రం నుంచి నిధుల సహకారం అవసరమైన రంగాలను గుర్తించే పనిలో ఉందని ఆరి్థక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. వినియోగానికి ఊతమిచ్చేందుకు ప్రభుత్వం తన వ్యయాలను వేగవంతం చేయాల్సి ఉందన్నారు. ఇందులో మౌలిక సదుపాయాలపై ఖర్చు చేయడమే ఉత్తమమని చెప్పారు. ఇప్పటికే 100 లక్షల కోట్లను మౌలిక రంగంపై ఖర్చు చేయనున్నట్టు తాము ప్రకటించామని, దాన్ని వేగవంతం చేయాల్సి ఉందన్నారు. ప్రాజెక్టులను వేగంగా గుర్తించేందుకు టాస్‌్కఫోర్స్‌ను ఏర్పాటు చేశామని, దాంతో నిధులు వెచ్చించడం వీలు పడుతుందని వివరించారు. ‘‘ఇప్పటికే టాస్‌్కఫోర్స్‌ పని ఆరంభించింది. ప్రాజెక్టులను గుర్తించే పనిలో ఉంది’’ అని మంత్రి వెల్లడించారు. నీతిఆయోగ్‌ సీఈవోతోపాటు వివిధ శాఖల కార్యదర్శులు, ఇతర సీనియర్‌ అధికారులతో ప్రభుత్వం ఈ టాస్‌్కఫోర్స్‌ను ఏర్పాటు చేయడం గమనార్హం. ప్రభుత్వం ఇప్పటికే రెండు భారీ నిర్ణయాలను (ప్రోత్సాహకాలు) ప్రకటించిందని, మరో ఒకటి రెండు నిర్ణయాలు ఉంటాయని హామీనిచ్చారు. 

5 ట్రిలియన్‌ డాలర్లు సాధ్యమే...
5 ట్రిలియన్‌ డాలర్ల ఆరి్థక వ్యవస్థగా భారత్‌ను తీసుకెళ్లేందుకు... మౌలిక రంగంపై నిధులు ఖర్చు చేయడంతోపాటు, ప్రభుత్వరంగ బ్యాంకుల విలీన ని ర్ణయాలు భాగమేనని మంత్రి తెలిపారు. దేశ జీడీపీ 5 శాతానికి జూన్‌ క్వార్టర్‌లో పడిపోయిన నేపథ్యంలో, 5 ట్రిలియన్‌ డాలర్లకు జీడీపీని తీసుకెళ్లడం సాధ్యమేనా? అన్న మీడియా ప్రశ్నకు.. జీడీపీ పెరగడం, తగ్గడం మామూలేనని.. యూపీఏ హయాంలో 2012–15లోనూ ఇదే జరిగిందని పేర్కొన్నారు.   రానున్న త్రైమాసికాల్లో జీడీపీ వృద్ధిని పెంచడంపైనే ప్రభుత్వం దృష్టి సారించినట్టు చెప్పారు.

వాహన అమ్మకాల క్షీణతకు ఓలా, ఉబెర్‌ కూడా కారణమే..
వాహన అమ్మకాలు పడిపోవడానికి ఎన్నో కారణాలు ఉన్నట్టు మంత్రి నిర్మలా సీతారామన్‌ చెప్పారు. మిలినీయల్స్‌ (యువత) మనస్తత్వం మారిందని, వారు సొంత కారు కంటే, ఓలా, ఊబర్‌  సేవలను వినియోగించుకోవడానికి ప్రాధాన్యం ఇస్తున్నారని ఆమె చెప్పారు. బీఎస్‌–6 నిబంధనలకు మారడం, రిజిస్ట్రేషన్‌ సంబంధిత అంశాలు, వినియోగదారుల ఆలోచనల్లో మార్పు రావడం గడ్డు పరిస్థితులకు కారణాలుగా పేర్కొన్నారు. ‘మిలీనియల్స్‌ ఆటోమొబైల్‌ వాహనం కోసం ప్రతీ నెలా ఈఎంఐ చెల్లించడానికి ఇష్టపడడం లేదు. బదులు ఓలా, ఊబర్‌ లేదా మెట్రో రైలు సేవలను వినియోగించుకుంటున్నారు. ఈ అంశాలన్నీ వాహన పరిశ్రమపై ప్రభావం చూపించాయి. వీటి పరిష్కారానికి ప్రయత్నిస్తున్నాం’ అని మంత్రి చెప్పారు.  

మరిన్ని వార్తలు