‘ఓలా క్యాబ్స్’లో 2,500 కోట్ల పెట్టుబడులు

17 Apr, 2015 02:13 IST|Sakshi
‘ఓలా క్యాబ్స్’లో 2,500 కోట్ల పెట్టుబడులు

న్యూఢిల్లీ: విస్తరణలో భాగంగా ట్యాక్సీ సేవల సంస్థ ‘ఓలా’ తాజాగా 400 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 2,500 కోట్లు) సమీకరించింది. ఈ ఏడాది ఆఖరు నాటికి కార్యకలాపాలను రెట్టింపు స్థాయిలో 200 నగరాలకు విస్తరించడంతో పాటు క్యాబ్స్ సంఖ్యను కూడా పెంచుకోనుంది. కొత్తగా పెట్టుబడులు పెట్టిన వాటిల్లో జీఐసీ, ఫాల్కన్ ఎడ్జ్ క్యాపిటల్‌తో పాటు ఇప్పటికే ఇన్వెస్ట్ చేసిన సాఫ్ట్‌బ్యాంక్ గ్రూప్, టైగర్ గ్లోబల్, స్టెడ్‌వ్యూ క్యాపిటల్, యాక్సెల్ పార్ట్‌నర్స్ సంస్థలు ఉన్నాయి.

ఓలా సహవ్యవస్థాపకుడు, సీఈవో భవిష్ అగర్వాల్ ఈ విషయాలు తెలిపారు. సెప్టెంబర్ నాటికి 1,000 మంది పైగా ఇంజనీర్లను తీసుకోనున్నట్లు  చెప్పారు. ప్రస్తుతం 100 నగరాల్లో కార్యకలాపాలు, 500 మంది ఇంజినీరింగ్ సిబ్బంది ఉన్నారన్నారు. ఇటీవలే కొనుగోలు చేసిన ట్యాక్సీఫర్‌ష్యూర్ విస్తరణకు 100 మిలి యన్ డాలర్లు వెచ్చించనున్నట్లు తెలిపారు.

>
మరిన్ని వార్తలు