ఓఎల్‌ఎక్స్‌లో మరిన్ని భద్రతా ఫీచర్లు

1 Jul, 2019 11:30 IST|Sakshi

ఓఎల్‌ఎక్స్‌లో మరిన్ని భద్రతా ఫీచర్లు  

హైదరాబాద్‌: ఆన్లైన్  ప్రకటనల వేదిక ఓఎల్‌ఎక్స్‌ వినియోగదారుల భద్రతకు సంబంధించి మరిన్ని చర్యలను అమల్లోకి తీసుకొచ్చింది. ఆన్‌లైన్లో సురక్షిత లావాదేవీల నిర్వహణ, సైబర్‌ భద్రత పట్ల వారిలో అవగాహన కల్పించనుంది. ఉత్పత్తుల ఉన్నతీకరణ, యూజర్ల భద్రత మార్గదర్శకాలు, సోషల్‌ మీడియాలో డిజిటల్‌ ప్రచారం చర్యలను కూడా చేపట్టనుంది. సైబర్‌ పీస్‌ ఫౌండేషన్ తో ఓఎల్‌ఎక్స్‌ భాగస్వామ్యం కుదుర్చుకుంది. సైబర్‌ భద్రతా అవగాహన సదస్సులను తొలిదశ కింద రాజస్థాన్, కర్ణాటక రాష్ట్రాల్లో నిర్వహించనుంది. యూజర్ల భద్రత కోణంలో ఓఎల్‌ఎక్స్‌ యాప్‌లో సేఫ్టీ ఫీచర్లను కూడా ప్రవేశపెట్టినట్టు సంస్థ ప్రకటించింది. స్పామ్, హానికారక కంటెంట్‌ గురించి రిపోర్ట్‌ చేయవచ్చని తెలిపింది.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు