2025 నాటికి లక్ష స్టార్టప్‌లు: పాయ్‌

28 Feb, 2018 01:01 IST|Sakshi

న్యూఢిల్లీ: భారత్‌లో 2025 నాటికి లక్ష స్టార్టప్‌లు ఉంటాయని మణిపాల్‌ గ్లోబల్‌ ఎడ్యుకేషన్‌ చైర్మన్‌ టీవీ మోహన్‌దాస్‌ పాయ్‌ చెప్పారు. 2030 నాటికి స్టార్టప్‌ వ్యవస్థ దేశంలో 10 లక్షల కోట్ల డాలర్ల ఎకానమీని సృష్టించే అవకాశం ఉందన్నారు. ‘‘ప్రస్తుతం మన దేశంలో 32,000 స్టార్టప్‌లు ఉన్నాయి. ఏటా 7,000 స్టార్టప్‌లు ఆరంభమవుతున్నాయి. 2025 నాటికి ఈ స్టార్టప్‌ల సంఖ్య లక్షకు చేరుతుంది. 32.5 లక్షల మందికి ఉద్యోగాలను కల్పించగలదు’’ అని స్టార్టప్‌లపై ఎన్‌ఎస్‌ఈ నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాయ్‌ చెప్పారు.

.మోహన్‌దాస్‌ పాయ్‌ ఏంజెల్‌ ఇన్వెస్టర్‌గా పలు స్టార్టప్‌ సంస్థల్లో ఇన్వెస్ట్‌ కూడా చేశారు. కొత్త తరహా టెక్నాలజీ లతో వచ్చే స్టార్టప్‌లు పబ్లిక్‌ ఇష్యూలకు వెళ్లడం ద్వారా బ్రాండ్‌ విలువను సృష్టించుకోవాలని ఆయన సూచించారు. అమెరికా, చైనా తర్వాత స్టార్టప్‌లకు భారత్‌ అతిపెద్ద దేశమన్నారు. స్టార్టప్‌లు ఓ స్థాయికి చేరుకోగానే పబ్లిక్‌ ఇష్యూలకు వెళ్లాలని ఇదే కార్యక్రమంలో పాల్గొన్న ఎన్‌ఎస్‌ఈ చైర్మన్‌ విక్రం లిమాయే కూడా సూచిం చారు. స్టార్టప్‌లు ఎదిగేందుకు, సమర్థవంతంగా కొనసాగేందుకు తగిన వ్యవస్థ ఏర్పాటు చేయడానికి ఎన్‌ఎస్‌ఈ కట్టుబడి ఉందన్నారు. 

మరిన్ని వార్తలు