ఆన్లైన్ మార్కెట్కు ఊతం గ్రాబ్ఆన్!

6 May, 2016 16:40 IST|Sakshi

హైదరాబాద్: ఈ కామర్స్ కంపెనీల్లో కొనుగొళ్లకు వినియోగదారులను ఆకర్షించడంలో ఎట్రాక్టీవ్ ఆఫర్స్తో వచ్చే కూపన్స్ పోషించే పాత్ర వేరే చెప్పక్కర్లేదు. వివిధ కూపన్స్ ద్వారా ఈ కామర్స్ సంస్థల అమ్మకాలకు ఊతాన్నిస్తూ కూపనింగ్ పోర్టల్ 'గ్రాబ్ఆన్' దూసుకుపోతోంది. 2014లో ప్రారంభమై రెండేళ్లలోనే కూపన్స్ అండ్ డీల్స్ వెబ్సైట్లలో తమ గ్రాబ్ఆన్ టాప్ పొజిషన్లో నిలిచిందని సీఈవో అశోక్ రెడ్డి వెల్లడించారు. కొత్త ఈ కామర్స్ సంస్థలు హైదరాబాద్ కేంద్రంగా తమ కార్యకలాపాలను నిర్వహించడానికి ముందుకొస్తున్న నేపథ్యంలో నగరంలో 'గ్రాబ్ఆన్' సేవలను మరింత విస్తృత పరుస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

భారత్లో ఈ కామర్స్ రంగంలో అమ్మకాలు రోజురోజుకూ పెరుగుతున్న మాదిరిగానే సంస్థల మధ్య పోటీ సైతం పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే కూపనింగ్ మార్కెట్కు ప్రాధాన్యత ఏర్పడింది. ఆన్లైన్ సేల్స్ పెంచడానికి, చిన్న కంపెనీలు తమ ఆన్లైన్ మార్కెట్ను విస్తృతపరుచుకునేందుకు గ్రాబ్ఆన్ అందిస్తున్న సేవలు ఎంతగానో దోహదం చేస్తాయని ఈ సందర్భంగా వెల్లడించారు.
 

మరిన్ని వార్తలు