ఎస్‌బీహెచ్ ఓటీఎస్ స్కీం

2 Jul, 2015 01:15 IST|Sakshi
ఎస్‌బీహెచ్ ఓటీఎస్ స్కీం

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రభుత్వరంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ (ఎస్‌బీహెచ్) మొండి బకాయిలను తగ్గించుకోవడానికి ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని చేపట్టింది. రుణాలు తీసుకొని కనీసం వడ్డీ కూడా చెల్లించకుండా ఉన్న మొండి బకాయిలను వసూలు చేయడం కోసం  అదాలత్ పేరిట ‘వన్‌టైమ్ సెటిల్‌మెంట్ (ఓటీఎస్)’ పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది. జూలై 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు ఈ ఓటీఎస్ స్కీం అమల్లో ఉంటుందని, డిఫాల్టర్లు సమీప బ్యాంకు శాఖకు వెళ్ళి రుణ బకాయిలను పరిష్కరించుకోవచ్చని బ్యాంకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. వ్యవసాయ,  చిన్న, మధ్య స్థాయి పారిశ్రామిక రంగాల వారు ఈ ఓటీఎస్ స్కీంను వినియోగించుకోవడం ద్వారా పెనాల్టీలు, న్యాయపరమైన చర్యల నుంచి తప్పించుకోవచ్చని బ్యాంకు పేర్కొంది.

>
మరిన్ని వార్తలు