అందరివాడు... దాస్‌

12 Dec, 2019 00:51 IST|Sakshi
శక్తికాంత దాస్‌

ఆర్‌బీఐ గవర్నర్‌గా ఏడాది

న్యూఢిల్లీ: దేశీ బ్యాంకింగ్‌ రంగ నియంత్రణ సంస్థ రిజర్వ్‌ బ్యాంక్‌ గవర్నర్‌గా శక్తికాంత దాస్‌ బాధ్యతలు చేపట్టి సంవత్సరమవుతోంది. గతేడాది డిసెంబర్‌ 12న ఆర్‌బీఐ గవర్నర్‌గా ఉర్జిత్‌ పటేల్‌ అర్ధంతరంగా నిష్క్రమించిన తర్వాత అనూహ్యంగా ఆ స్థానంలో దాస్‌ నియమితులయ్యారు. బ్యూరోక్రాట్‌ స్థాయి నుంచి స్వతంత్ర ప్రతిపత్తి గల ఆర్‌బీఐ 25వ గవర్నర్‌గా ఎదిగారాయన.  1980 బ్యాచ్‌ తమిళనాడు కేడర్‌ ఐఏఎస్‌ అధికారి అయిన దాస్‌.. గతంలో కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి సహా పలు హోదాల్లో సేవలు అందించారు.

అందరినీ కలుపుకుపోవడం, అందరూ తమ అభిప్రాయాలు తెలిపేందుకు అవకాశమివ్వడం .. దాస్‌ స్టయిల్‌ అంటారు ఆయన్ను గురించి తెలిసినవారు. ప్రభుత్వానికి నిధుల బదిలీ, మొండిబాకీల పరిష్కారానికి కొత్త విధానం ప్రవేశపెట్టడం మొదలుకుని వరుసగా పలు దఫాలు కీలక రేట్లను తగ్గించడం దాకా ఈ ఏడాది కాలంలో ఆర్‌బీఐ అనేక కీలక నిర్ణయాలు తీసుకుంది. బ్యాంకింగ్‌ రంగంలో సంక్షోభాలు, మందగిస్తున్న ఆర్థిక వృద్ధి తదితర సవాళ్ల మధ్య దాస్‌ సారథ్యంలో ఆర్‌బీఐ పనితీరును ఒకసారి సింహావలోకనం చేస్తే ..

► ఆర్థిక వృద్ధికి ఊతమిచ్చే క్రమంలో ఆర్‌బీఐ 2019 ఫిబ్రవరి నుంచి ఇప్పటిదాకా అయిదు విడతల్లో 135 బేసిస్‌ పాయింట్ల మేర రెపో రేటును తగ్గించింది. ఆగస్టులో అసాధారణంగా 35 బేసిస్‌ పాయింట్లు తగ్గించింది. అయితే, కచ్చితంగా మరో విడత రేట్లను తగ్గిస్తుందన్న అంచనాలను తల్లకిందులు చేస్తూ నవంబర్‌లో నిర్ణయం తీసుకోవడం అందర్నీ విస్మయపర్చింది.
► స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) వృద్ధి అంచనాలను కూడా మొత్తం మీద 240 బేసిస్‌ పాయింట్ల మేర తగ్గించింది.  
► ఆర్‌బీఐ వద్ద ఎంత మేర నిధులు ఉండాలన్న వివాదాస్పద చర్చకు ముగింపునిచ్చి, కేంద్రానికి రూ. 1,76,051 కోట్ల మేర మిగులు నిధులను రిజర్వ్‌ బ్యాంక్‌ బదలాయించింది.  
► చిన్న, మధ్యతరహా సంస్థలకు ఊరటనిస్తూ వన్‌ టైమ్‌ రుణ పునర్‌వ్యవస్థీకరణ వెసులుబాటు కల్పించింది.
► సత్వర దిద్దుబాటు చర్యలకు (పీసీఏ) సంబంధించిన ఆంక్షలు ఎదుర్కొంటున్న 11 బ్యాంకుల్లో నుంచి మూడు బ్యాంకులను (బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర, ఓరియంటల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ కామర్స్‌) బైటికి తెచ్చింది.  
► సంస్కరణలపరంగా చూస్తే.. ద్రవ్య పరపతి విధానాల ప్రయోజనాలు సత్వరం బదిలీ అయ్యేలా... బ్యాంకులు రుణాలకు సంబంధించి రెపో ఆధారిత ఎక్స్‌టర్నల్‌ బెంచ్‌మార్క్‌ విధానానికి మళ్లేలా దాస్‌ కృషి చేశారు.  
► రోజంతా చెల్లింపుల వ్యవస్థలు పనిచేసేలా చూసేందుకు నెఫ్ట్‌ సదుపాయం  24 గంటలూ అందుబాటులో ఉండేలా ఆర్‌బీఐ నిర్ణయం తీసుకుంది. ఇది 2020 జనవరి నుంచి అమల్లోకి వస్తోంది.


ఆర్‌బీఐదే తుది నిర్ణయం..
ఆర్‌బీఐ, ప్రభుత్వం మధ్య చాలా విషయాలపై విస్తృతంగా చర్చలు జరుగుతాయి. కానీ, అంతిమంగా నిర్ణయం తీసుకునేది రిజర్వ్‌ బ్యాంకే. నిర్ణయాలు తీసుకోవడంలో ఆర్‌బీఐకి 100 శాతం పైగా స్వయం ప్రతిపత్తి ఉంది. ఇందులో ఎవరి జోక్యం ఉండదు.  
– శక్తికాంత దాస్, గవర్నర్, ఆర్‌బీఐ

అందర్నీ ఒకే తాటిపైకి తెచ్చారు
నిబద్ధత, పారదర్శకత, నిజాయితీ గల వ్యక్తి శక్తికాంత దాస్‌. ప్రభుత్వాన్ని, వ్యవస్థను ఒకే తాటిపైకి తేవడంలోనూ, బోర్డును సమగ్రంగా తీర్చిదిద్దడంలోను అన్ని విధాలా సఫలీకృతమయ్యారు.  
– సచిన్‌ చతుర్వేది, ఆర్‌బీఐ సెంట్రల్‌ బోర్డు సభ్యుడు

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

అలా ఎలా రుణాలిచ్చేశారు?

ఈ ఏడాది భారత్‌ వృద్ధి 5.1 శాతమే!

ఖతార్‌ ఫండ్‌కు అదానీ ఎలక్ట్రిసిటీలో వాటా

సౌదీ ఆరామ్‌‘కింగ్‌’!

దేశీ మార్కెట్లోకి అమెజాన్‌ ఫైర్‌ టీవీలు

రూ. 2,400 కోట్ల పూచీకత్తు ఇవ్వండి

ఆకర్షణీయంగా ఆటోమొబైల్, కార్పొరేట్‌ బ్యాంకులు

రుణాల విభాగంలోకి రియల్‌మీ

ఆస్తుల విక్రయ ప్రయత్నాల్లో ఐడియా!

చివర్లో పుంజుకున్న మార్కెట్‌

త్వరలో రాకెట్‌ వేగంతో ప్రయాణించే కారు..

ఖతార్‌ - అదానీ భారీ డీల్‌

రూ.12,999కే స్మార్ట్ టీవీ..!

పేటీఎం ఫౌండర్‌ అనూహ్య నిర్ణయం

లాభాల ప్రారంభం

ట్యాక్సీ సేవల్లోకి ఇ–యానా

హ్యుందాయ్‌ కార్ల ధరలు పెంపు..!

పార్క్‌ హయత్‌లో ఐవోటీ ఆధారిత వాటర్‌ ప్లాంట్‌

యస్‌ బ్యాంక్‌లో పెట్టుబడులపై అనిశ్చితి

11,900 దిగువకు నిఫ్టీ

ముంబై మెట్రోకు ‘శ్రీసిటీ’ బోగీలు

రూ. 12 వేల కోట్ల లెక్క తప్పింది!!

‘కార్వీ’ ఉదంతంతో కన్సాలిడేషన్‌ వేగవంతం

గోల్డ్‌..క్రూడ్‌..రయ్‌ రయ్‌!

ఉద్యోగార్థులకు గుడ్‌న్యూస్‌..

అమ్మకాల సెగ, 200 పాయింట్ల పతనం

నష్టాల ప్రారంభం

ఒడిదుడుకులు... అయినా లాభాల్లోనే!!

ఈక్విటీ ఫండ్స్‌లోకి తగ్గిన పెట్టుబడులు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఆర్‌ఆర్‌ఆర్‌ షూటింగ్‌ వీడియో వైరల్‌ 

నా జీవితంలో ఆ రెండూ ప్లాన్‌ చేయకుండా జరిగినవే!

శ్రుతి కుదిరిందా?

వారి పేర్లు బయటపెడతా: వర్మ

కొబ్బరికాయ కొట్టారు

క్లాస్‌.. మాస్‌ అశ్వథ్థామ