ధర రూ.29,999; రూ.34,999
న్యూఢిల్లీ: చైనా స్మార్ట్‌ఫోన్ కంపెనీ వన్‌ప్లస్ తన ఫ్లాగ్‌షిప్ మొబైల్ వన్‌ప్లస్ 3లో తాజా వెర్షన్‌ను శుక్రవారం నాడు మార్కెట్లోకి తెచ్చింది. వన్‌ప్లస్ 3టీ పేరుతో 64జీబీ(ధర రూ.29,999), 128 జీబీ(ధర రూ.34,999) వేరియంట్లలో ఈ ఫోన్లను అంది స్తోంది. ఈ ఫోన్లను 8 జీబీ ర్యామ్‌తో కూడిన అత్యంత శక్తివంతమైన క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 821 ప్రాసెసర్(2.35 గిగా హెట్జ్)తో రూపొందించామని వన్‌ప్లస్ సీఈఓ పీటే లీయూ చెప్పారు. ఈ నెల 14 నుంచి అమెజాన్ ద్వారా వీటిని కొనుగోలు చేయవచ్చని పేర్కొన్నారు.
త్వరలో కొన్ని ఆఫర్లను అందించనున్నామని వన్‌ప్లస్ జనరల్ మేనేజర్(ఇండియా) వికాస్ అగర్వాల్ చెప్పారు. ఆండ్రారుుడ్ 6.0 1 ఆధారిత ఆక్సిజన్‌ఓఎస్ కస్టమ్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేసే ఈ ఫోన్‌లో 5.5 అంగుళాల ఆప్టిక్ అమెలెడ్ డిస్‌ప్లే, 3,400 ఎంఏహెచ్ బ్యాటరీ, అరగంటలోనే చార్జింగ్ చేయగల ద డాష్ చార్జ్ టెక్నాలజీ, ముందు, వెనకా 16 మెగాపిక్సెల్ కెమెరాలు, వెనక భాగంలో ఉండే కెమెరాకు, స్మార్ట్ క్యాప్చర్, ఆప్టికల్ ఇమేజ్ స్టాబిలైజేషన్ తదితర ఫీచర్లున్నాయని వివరించారు.