రికార్డులు బద్దలు కొట్టిన వన్‌ప్లస్‌ 5టీ

24 Nov, 2017 16:15 IST|Sakshi

చైనీస్‌ స్మార్ట్‌ఫోన్‌ తయారీదారి వన్‌ప్లస్‌ తాజాగా తీసుకొచ్చిన వన్‌ప్లస్‌ 5టీ స్మార్ట్‌ఫోన్‌ శుక్రవారం విక్రయానికి వచ్చింది. అమెజాన్‌ ప్లాట్‌ఫామ్‌పై స్పెషల్‌ వన్‌-అవర్‌ ప్రీవ్యూ సేల్‌ కింద విక్రయానికి వచ్చిన ఈ ఫోన్‌, కేవలం ఐదు నిమిషాలోనే అవుటాఫ్‌ స్టాక్‌ అయింది. భారత్‌లో, గ్లోబల్‌గా ఈ స్మార్ట్‌ఫోన్‌కు కస్టమర్ల నుంచి అనూహ్య స్పందన చూస్తున్నామని వన్‌ప్లస్‌ ఇండియా జనరల్ మేనేజర్‌ వికాశ్‌ అగర్వాల్‌ తెలిపారు. బెంగళూరు, ఢిల్లీలోని తమ ఎక్స్‌పీరియన్స్‌ స్టోర్లకు వందలాది మంది అభిమానలు తరలి వచ్చినట్టు పేర్కొన్నారు. నవంబర్‌ 28 నుంచి ఇక  ఈ స్మార్ట్‌ఫోన్‌ ఓపెన్‌ సేల్‌కు వస్తున్నట్టు ప్రకటించడం చాలా సంతోషంగా ఉందని, అన్ని ఛానళ్లలోనూ ఈ స్మార్ట్‌ఫోన్‌ అందుబాటులో ఉంటుందని తెలిపారు. కంపెనీ లాంచ్‌-డే సేల్స్‌ రికార్డులను వన్‌ప్లస్‌ 5టీ బద్దలు కొట్టింది. ఆరు గంటల్లో అత్యంత వేగంగా అమ్ముడుపోయిన కంపెనీ స్మార్ట్‌ఫోన్‌గా నిలిచింది.  

వన్‌ప్లస్‌ 5టీ ఫీచర్లు..
6 అంగుళాల అప్టిక్‌ అమోలెడ్‌ డిస్‌ప్లే
ప్రొటెక్షన్‌ కోసం గొర్రిల్లా గ్లాస్‌ 5
ఆక్టాకోర్‌ స్నాప్‌డ్రాగన్‌ 835 ప్రాసెసర్‌
6జీబీ ర్యామ్‌, 64జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌
8జీబీ ర్యామ్‌, 128జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌
ఆక్సీజెన్‌ఓఎస్‌ ఆధారిత ఆండ్రాయిడ్‌ 7.1.1 నోగట్‌తో రన్నింగ్‌
రెండు ప్రైమరీ కెమెరాలు, ఒకటి 20మెగాపిక్సెల్‌ సెన్సార్‌, రెండోది 16 మెగాపిక్సెల్‌ మోడ్యూల్‌
ముందు వైపు 16 మెగాపిక్సెల్‌ కెమెరా
తక్కువ వెలుతురులో కూడా మెరుగైన ఇమేజ్‌లు తీయడం దీని ప్రత్యేకత
3,300 ఎమ్ఏహెచ్ బ్యాటరీ‌
ఫింగర్‌ప్రింట్‌ స్కానర్‌

మరిన్ని వార్తలు