వన్‌ప్లస్‌ 6 లాంచింగ్‌ మే 18...?

20 Apr, 2018 13:11 IST|Sakshi

స్మార్ట్‌ఫోన్‌ వినియోగదారులు ఎంతో ఆత్రంగా ఎదురు చూస్తున్న వన్‌ప్లస్‌ కొత్త  స్మార్ట్‌ఫోన్‌ లాంచింగ్‌పై పలు అంచనాలు మార్కెట్లో హల్‌ చల్‌ చేస్తున్నాయి.  చైనా స్మార్టఫోన్ల తయారీదారు వన్‌ప్లస్‌ తన కొత్త  ఫ్లాగ్‌షిప్‌ స్మార్ట్‌ఫోన్‌ వన్‌ప్లస్‌ 6ను 2018, మే 18న భారతదేశంలో లాంచ్‌ చేయనుందని సమాచారం. గతంలో వన్‌ప్లస్‌ కంపెనీ విడుదల చేసిన టీజర్‌లో చూపినట్లుగానే ఈ స్మార్ట్‌ఫోన్‌ ఐఫోన్‌ ఎక్స్‌ మాదిరి నాచ్‌ డిస్‌ప్లే డిజైన్‌తో మార్కెట్‌లోకి  విడుదల కానుంది.  64జీబీ బేస్‌ వేరియంట్‌ స్మార్ట్‌ఫోన్‌ ధర 34వేల రూపాయలుగానూ,  128 జీబీ టాప్‌ స్మార్ట్‌ఫోన్‌ వేరియంట్‌ ధర 39వేల రూపాయలుగా ఉండొచ్చని అంచనా.  ముఖ‍్యంగా వాటర్‌ రెసిస్టెన్స్‌ ఫిచర్‌ వన్‌ప్లస్‌ 6లో కీలక ఫీచర్‌గా ఉండనుంది. ఈ విషయాన్ని స్వయంగా వన్‌ప్లస్‌ సంస్థ సోమవారం పోస్టు చేసిన ట్విట్‌లో పేర్కొంది.

వన్‌ప్లస్‌ 6 స్పెషిఫికేషన్లపై అంచనాలు...

6.28 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీప్లస్‌ డిస్‌ప్లే
19:9 ఆస్పెక్ట్‌ రెషియో
845 సాన్‌డ్రాగన్‌ అక్టాకోర్‌ చిప్‌ సెట్‌
6జీబీ ర్యామ్‌
64జీబీ, 128జీబీ స్టోరేజ్‌ ఆప్షన్లు
వెనుకవైపు 16+20 మెగాపిక్సెల్‌ డ్యూయల్‌ సెన్సార్లు
ముందు వైపు 20 మెగాపిక్సెల్‌ కెమెరా
3450 ఎంఏహెచ్‌ బ్యాటరీ

ఈ సారి వన్‌ప్లస్‌ 6 లాంచింగ్‌తో పాటు వన్‌ప్లస్‌ కంపెనీ పదోవార్షికోత్సవాన్ని మార్వేల్స్‌ స్టూడియో భాగస్వామ్యంతో ‘అవేంజర్స్‌:ఇన్ఫినిటి వార్‌’ తో కలిసి నిర్వహించనున్నట్లు గురువారం తెలిపింది. గతంలో 2017, డిసెంబర్‌లో భారతదేశంలో తన మూడో వార్షికోత్సవాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా ‘వన్‌ప్లస్‌ 5టీ’ స్మార్ట్‌ఫోన్‌ను ‘స్టార్‌వార్స్‌’తో కలిసి లాంచ్‌ చేసిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు