వన్‌ప్లస్‌ 6 ధరెంతో తెలుసా?

1 May, 2018 10:53 IST|Sakshi

వచ్చే నెలలో భారత్‌లో లాంచ్‌ కాబోతున్న వన్‌ ప్లస్‌ 6 స్మార్ట్‌ఫోన్‌ వివరాలు లీకయ్యాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌ 64జీబీ స్టోరేజ్‌ మోడల్‌ ధర రూ.36,999 నుంచి ప్రారంభమవుతోందని, 128జీబీ స్టోరేజ్‌ మోడల్‌ ధర రూ.39,999గా ఉంటుందని ట్రూ-టెక్‌.నెట్‌ పేర్కొంది. 256జీబీ స్టోరేజ్‌తో మరో మోడల్‌ కూడా మార్కెట్‌లోకి రాబోతోంది. కానీ ఈ హై-ఎండ్‌ మోడల్‌ ధర వివరాలు బహిర్గతం కాలేదు. అయితే 64జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ 6జీబీ  ర్యామ్‌ లేదా 8జీబీ ర్యామ్‌తో వస్తున్నదా? అన్నది ఇంకా క్లారిటీగా తెలియదు. 128జీబీ, 256జీబీ స్టోరేజ్‌ ఆప్షన్లు మాత్రం 8జీబీ ర్యామ్‌తో మార్కెట్‌లోకి వస్తున్నాయి. 

మే 17న ఈ స్మార్ట్‌ఫోన్‌ భారత మార్కెట్‌లోకి లాంచ్‌ కాబోతోంది. ఇప్పటికే ఈ స్మార్ట్‌ఫోన్‌ అమెజాన్‌ ఇండియా రిజిస్ట్రేషన్‌ పేజీ లైవ్‌కు వచ్చింది. ధరతో పాటు పలు ఫీచర్లు కూడా ఈ స్మార్ట్‌ఫోన్‌వి లీకవుతూ వస్తున్నాయి. ఫుల్‌ వ్యూ డిస్‌ప్లేతో ఐఫోన్‌ ఎక్స్‌ మాదిరి నాచ్‌ను ఇది కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఈ ఫోన్‌లో మరో బిగ్‌ ఛేంజ్‌ ఆల్‌-గ్లాస్‌ బాడీ డిజైన్‌, గ్లాస్‌ బ్యాక్‌ను కలిగి ఉండబోతోంది. క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 835 ప్రాసెసర్‌, వైర్‌లెస్‌ ఛార్జింగ్‌, వాటర్‌, డస్ట్‌ రెసిస్టెన్స్‌ పలు ఫీచర్లు దీనిలో ఉండబోతున్నాయని టాక్‌.  
 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా