10జీబీ మెక్‌లారెన్‌ ఎడిషన్‌ వస్తోంది

30 Nov, 2018 14:07 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: భారీ అమ్మకాలతో దుమ్ము రేపుతున్న చైనా స్మార్ట్‌ఫోన్‌ దిగ్గజం వన్‌ప్లస్‌ మరో సంచలనానికి నాంది పలికింది. వన్‌ప్లస్ 6టీను ఏకంగా 10జీబీ వెర్షన్‌లో తీసుకురాబోతోంది.  స్పీడ్‌కు సలాం అంటూ సరికొత్త హంగులతో మెక్‌లారెన్‌ ఎడిషన్‌ (అత్యంత ఖరీదైన ప్రముఖ స్పోర్ట్స్ కారు) వన్‌ప్లస్‌ 6టీని 10జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్‌ డిసెంబర్ 11న లండన్‌లో లాంచ్‌ చేయనుంది. అలాగే డిసెంబరు 12న ఇండియన్‌ మార్కెట్లోకి తీసుకువస్తోంది. ఈ మేరకు ట్విటర్‌లో ఒక టీజర్‌ను వదిలింది.

కాగా కంపెనీ ఇప్పటికే వన్‌ప్లస్‌ 6టీ థండర్‌ పర్పుల్‌ ఎడిషన్‌ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. లిమిటెడ్‌ ఎడిషన్‌గా తీసుకొస్తున్న ఈ స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్లు​ 6టీ కు సమానంగా ఉండవచ్చని భావిస్తున్నారు. ధర తదితర వివరాలను అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

మరిన్ని వార్తలు