వన్‌ప్లస్‌ బడ్జెట్‌ ఫోన్‌ : టీజర్‌

4 Jul, 2020 12:53 IST|Sakshi

సాక్షి, ముంబై:  చైనా స్మార్ట్‌ఫోన్‌ తయారీ దారు  వన్‌ప్లస్‌ తన  అప్‌  కమింగ్‌  బడ్జెట్‌  స్మార్ట్‌ఫోన్‌పై  తాజాగా ఒక టీజర్‌ను విడుదల చేసింది.  ‘నార్డ్‌’ పేరుతో తీసుకొస్తున్న   ఈ బడ్జెట్‌ ఫోన్‌కు సంబంధించిన ఫీచర్లపై  తన అభిమానులకు హింట్‌ ఇచ్చింది. డియర్‌ పాస్ట్‌ పేరుతో  వన్‌ప్లస్  ట్విటర్‌, యూట్యూబ్ ఛానల్, ఇన్‌స్టాగ్రామ్ పేజీలో చిన్న టీజర్ వీడియోను షేర్‌ చేసింది. ('మేక్ ఇన్ ఇండియా'కు కట్టుబడి ఉన్నాం’)

బడ్జెట్‌ ఫోన్‌గా వన్‌ప్లస్  భారీగా ప్రచారం చేస్తున్న ‘నార్డ్’  ఫోన్‌ ఫీచర్లపై పూర్తి స్పష్టత లేనప్పటికీ   ధర సుమారు  37,300 గా ఉండవచ్చని అంచనా.  ట్రిపుల్ రియర్ కెమెరా ,  డ్యూయల్ సెల్ఫీ కెమెరాలను అమర్చినట్టు తెలుస్తోంది. భారతీయ మార్కెట్లోకి తీసుకురానున్న ఈ  నార్డ్‌ ప్రీ బుకింగ్స్‌ను  అమెజాన్‌ లో త్వరలోనే ప్రారభించనుంది.

 వన్‌ప్లస్‌ నార్డ్‌  ​ఫీచర్లుపై అంచనాలు
 6.4 అంగుళాల డిస్‌ప్లే
 ఆండ్రాయిడ్‌​ 10
క్వాల్కం స్నాప్‌ డ్రాగన్‌765జీ 5జీ  ప్రాసెసర్‌
10 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌
4000ఎంఏహెచ్‌ బ్యాటరీ

New direction, pure OnePlus. Watch the full movie on @oneplus.nord #OnePlusNord #NewBeginnings Learn more: http://onepl.us/NordAz

A post shared by OnePlus India (@oneplus_india) on

మరిన్ని వార్తలు