భారీ పెట్టుబడితో వన్‌ప్లస్‌ ఆర్‌ అండ్‌ డీ కేంద్రం

26 Aug, 2019 14:45 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్ :  మొబైల్‌  తయారీ సంస్థ వన్‌ప్లస్  భారీ పెట్టుబడితో తన ఆర్‌అండ్‌ డి కేంద్రాన్ని  హైదరాబాద్‌లో ఏర్పాటు చేసింది.  టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ కేంద్రాన్ని ఆరంభించారు.  ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్  హైదరాబాద్‌లో వన్ ప్లస్ ఆర్ అండ్ డీ సెంటర్ కోసం వెయ్యి కోట్ల పెట్టుబడి పెట్టడం మంచి పరిణామమని కేటీర్‌ వ్యాఖ్యానించారు.  దీని ద్వారా రానున్న రెండేళ్లలో 1500 ఉద్యోగ అవకాశాలు రానున్నాయన్నారు.  సంస్థకు కావాల్సిన మద్దతును టీఆర్ఎస్ ప్రభుత్వం అందిస్తుందని ఈ  సందర్భంగా  కేటీఆర్‌  హామీ ఇచ్చారు. అలాగే వన్ ప్లస్ మొబైల్స్ మనుఫ్యాక్చరింగ్ సెంటర్ కూడా హైదరాబాద్ లో ఏర్పాటు చేయాలని ఆయన అభిలషించారు. 

ప్రపంచంలోనే అతిపెద్ద కేంద్రంగా దీన్ని అభివృద్ది చేయాలని వన్‌ప్లస్‌ యోచిస్తోందని కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాలపై పనిచేసే సంస్థలకు హైదరాబాద్  ఆకర్షణీయ స్థానంగా అవతరించిందన్నారు. అటు హైదరాబాద్‌లో తమ సంస్థ ఆర్‌ అండ్‌ డీ సెంటర్‌ ను ఏర్పాటు చేయడం  సంతోషంగా ఉందన్నారు  వన్‌ ప్లేస్‌ ఫౌండర్‌ అండ్‌ సీఈవో పీట్‌ లౌ. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఐటీ సెక్రటరీ జయేశ్ రంజన్ కూడా హాజరయ్యారు.  


 

మరిన్ని వార్తలు