రికార్డు బద్దలుకొడుతున్న వన్‌ప్లస్‌ 6 

15 Jun, 2018 15:48 IST|Sakshi

అత్యంత తక్కువ సమయంలోనే బెస్ట్‌ సెల్లింగ్‌ స్మార్ట్‌ఫోన్‌గా వన్‌ప్లస్‌ తన రికార్డులను బద్దలు కొడుతోంది. 22 రోజుల క్రితం లాంచ్‌ అయిన ఈ స్మార్ట్‌ఫోన్‌, ఇప్పటికే 10 లక్షల యూనిట్ల విక్రయాలను నమోదు చేసింది. ఈ మైలురాయిని తాకిన క్రమంలో వన్‌ప్లస్‌ ‘కమ్యూనిటీ సెలబ్రేషన్స్‌’ను నిర్వహిస్తోంది. ఈ సెలబ్రేషన్స్‌లో భాగంగా వన్‌ప్లస్‌ 6 స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకునే వారికి సరికొత్త ఆఫర్లను ప్రకటించింది.  సిటీ బ్యాంకు క్రెడిట్‌ లేదా డెబిట్‌ కార్డులను వాడుతూ ఈ ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకునే వారికి రెండు వేల రూపాయల క్యాష్‌బ్యాక్‌ను ఈ కంపెనీ అందిస్తోంది. ఈ ఆఫర్‌లోనే మూడు నెలల నో-కాస్ట్‌ ఈఎంఐ కూడా అందుబాటులో ఉంటుంది. 

లాయల్టీ ప్రొగ్రామ్‌లో భాగంగా.. వన్‌ప్లస్‌ 1500 రూపాయల అదనపు ఎక్స్చేంజ్‌ బోనస్‌ను అంతకముందు కస్టమర్లకు ఆఫర్‌ చేస్తోంది. ఇప్పటికే వన్‌ప్లస్‌ 6ను కొనుగోలు చేసిన కస్టమర్‌, తన స్నేహితుడిని కూడా వన్‌ప్లస్‌ 6 స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలని రిఫర్‌ చేస్తే... మూడు నెలల పాటు వారెంటీ కూడా పెరుగుతుంది. లాంచ్‌ అయిన దగ్గర్నుంచి వన్‌ప్లస్‌ 6 స్మార్ట్‌ఫోన్‌కు మంచి స్పందన వస్తోంది. ఇక స్పెషల్‌ అవెంజర్స్‌ ఇన్ఫినిటీ వార్‌ ఎడిషన్‌ ఫోన్‌ సెకన్లలోనే అవుటాఫ్‌ స్టాక్‌ అయింది. ఈ ఫోన్‌ ధర 44,999 రూపాయలు. 

మూడు వేరియంట్లలో వన్‌ప్లస్‌ 6ను కంపెనీ లాంచ్‌ చేసింది. మిర్రర్‌ బ్లాక్‌ ఫిన్నిస్‌, మిడ్‌నైట్‌ బ్లాక్‌, ది అవెంజర్స్‌ ఎడిషన్‌. బేస్‌ వేరియంట్‌ 6 జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర 34,999 రూపాయలు. రెండో వేరియంట్‌ 8 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ ఆప్షన్‌ ధర 39,999 రూపాయలు.  ఇక అవెంజర్స్‌ ఎడిషన్‌ 8 జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్‌లో మార్కెట్‌లోకి వచ్చింది.

ఈ ఫోన్‌లో ఫీచర్లు... కార్నింగ్‌ గొర్రిల్లా గ్లాస్‌ 5 ప్రొటెక్షన్‌తో అంతా గ్లాస్‌ డిజైన్‌లో ఇది రూపొందింది. 6.28 అంగుళాల ఫుల్‌ ఆప్టిక్‌ అమోలెడ్‌ డిస్‌ప్లే, 84 శాతం స్క్రీన్‌ టూ బాడీ రేషియో, క్వాల్‌కామ్‌ 845 ప్రాసెసర్‌, 16 మెగాపిక్సెల్‌, 20 మెగాపిక్సెల్‌ సెన్సార్లతో డ్యూయల్‌ రియర్‌ కెమెరా, 16 మెగాపిక్సెల్‌ ఫ్రంట్‌ కెమెరాలు ఉన్నాయి.  
 

మరిన్ని వార్తలు