వన్‌ప్లస్ కొత్త టీవీలు ఎంత సన్నగా ఉంటాయంటే..

26 Jun, 2020 20:32 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: వన్‌ప్లస్ తీసుకురానున్న టీవీలపై భారీ హైప్ క్రియేట్ అవుతోంది. తాజాగా వన్‌ప్లస్ టీవీలు తదుపరి సిరీస్ వన్‌ప్లస్ 8 స్మార్ట్‌ఫోన్ కంటే సన్నగా ఉండబోతున్నాయని వన్‌ప్లస్ సీఈఓ పీట్ లా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. అసలు వన్ ప్లస్  స్మార్ట్ ఫోన్లు అంటేనే స్లిమ్ అండ్ స్లీక్ డిజైన్ కి పెట్టింది పేరు. మరి ఇక వన్‌ప్లస్  టీవీలు ఇంకెంత  సన్నగా  ఉంటాయో అన్న ఆసక్తి నెలకొంది.  

తమ రానున్న టీవీల్లో అల్ట్రా-సన్నని డిజైన్ ఉంటుందని, డిజైన్, యూజర్ ఎక్స్‌పీరియన్స్ అనే రెండు కీలక అంశాలపై దృష్టి సారించినున్నట్లు సీఈఓ వెల్లడించారు. కేవలం 6.9 మి.మీ మందంతో తీసుకు రాబోతున్నామని ఆండ్రాయిడ్ సెంట్రల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. అంతేకాదు ఫ్లాగ్‌షిప్ క్యూ1 టెలివిజన్ కంటే తక్కువగా అందుబాటు ధరలో 20 వేల రూపాయలకు అందించనున్నామని చెప్పారు. ఈ కొత్త టెలివిజన్ సెట్లు జూలై 2 న ప్రారంభించనున్న సంగతి తెలిసిందే.  

కొత్త స్మార్ట్ టీవీలో 95 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియోతో సన్నని బెజెల్స్‌ ఫీచర్,  కొత్తం సౌండ్ సిస్టం, స్పీకర్లు 90 డిగ్రీల కోణంలో రొటేట్ అయ్యేలా రూపొందించామని తెలిపారు. సినిమాటిక్ డిస్‌ప్లే, డాల్బీ విజన్‌, నెట్‌ఫ్లిక్స్ యాప్‌ లాంటి ఫీచర్లను  హైలైట్ చేస్తూ గత వారమే పీట్ లా ట్వీట్‌ చేశారు. 

వన్‌ప్లస్ స్మార్ట్ టీవీ ధర, లభ్యత
వన్‌ప్లస్ టీవీలు 32, 43-అంగుళాల వేరియంట్లలో విడుదల కానున్నాయి. ప్రారంభ ధర  20 వేల రూపాయలు. ప్రస్తుతం, కొత్త వన్‌ప్లస్ టీవీలు అమెజాన్ ఇండియాలో ప్రీ-బుకింగ్ కోసం సిద్ధంగా ఉన్నాయి. అలాగే ప్రీ-బుక్ చేసే వినియోగదారులకు బీమా సంస్థ అకో నుండి రెండేళ్లపాటు వారంటీ లభిస్తుందని కంపెనీ పేర్కొంది. కాగా 2019లో స్మార్ట్ టీవీ పరిశ్రమలోకి ప్రవేశించిన వన్‌ప్లస్ క్యూ 1 సిరీస్ టీవీ ప్రారంభ ధర 69,900 రూపాయలు.

మరిన్ని వార్తలు