అసోంలో ఓఎన్‌జీసీ రూ.13,000 కోట్ల పెట్టుబడి..

12 Sep, 2019 11:06 IST|Sakshi

గౌహతి: అస్సామ్‌లో చమురు అన్వేషణ, ఉత్పత్తి  నిమిత్తం ఐదేళ్లలో రూ.13,000 కోట్లు పెట్టుబడులు పెట్టనున్నామని ఓఎన్‌జీసీ తెలిపింది. ఈ విషయమై అస్సామ్‌ రాష్ట్ర ప్రభుత్వంతో ఒక ఒప్పందం కుదుర్చుకున్నామని ఓఎన్‌జీసీ(ఆయిల్‌ అండ్‌ నేచురల్‌ గ్యాస్‌ కార్పొరేషన్‌) వెల్లడించింది. 2022 కల్లా దిగుమతులను 10% మేర తగ్గించుకోవాలన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు ఈ పెట్టుబడులు పెడుతున్నామని పేర్కొంది. నార్త్‌ఈస్ట్‌ హైడ్రోకార్బన్‌ విజన్‌ 2030లో భాగంగా ఈ పెట్టుబడుల ప్రణాళికను రూపొందించామని ఓఎన్‌జీసీ వివరించింది. అస్సామ్‌లోని జోర్హాట్, గోల్హాట్‌ జిల్లాల్లో ఆరు బావులు, ఐదు మైనింగ్‌ బ్లాక్‌ల్లో డ్రిల్లింగ్‌ కోసం ఆమోదాలు పొందామని తెలిపింది. ఇలాంటి 12 బావుల్లో డ్రిల్లింగ్‌ నిమిత్తం అనుమతుల కోసం వేచి చూస్తున్నామని పేర్కొంది.

మరిన్ని వార్తలు