పవన్‌ హన్స్‌ వాటా విక్రయానికి ఓకే

7 Aug, 2018 01:10 IST|Sakshi

గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన ఓఎన్‌జీసీ బోర్డ్‌

న్యూఢిల్లీ: హెలికాప్టర్‌ క్యారియర్‌ సంస్థ పవన్‌ హన్స్‌లో ఓఎన్‌జీసీకి ఉన్నటువంటి 49% వాటా విక్రయానికి కంపెనీ బోర్డ్‌ అంగీకారం తెలిపింది. కేంద్ర ప్రభుత్వానికి పవన్‌ హన్స్‌లో ఉన్న 51% వాటాతో కలిపి మొత్తం ఒకేసారి ఆఫర్‌ ఫర్‌ సేల్‌ రూపంలో ప్రైవేటు సంస్థకు అమ్మివేయడం ద్వారా పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యాన్ని చేరుకోవాలన్న ప్రభుత్వ ఆలోచనకు మార్గం సుగమమైంది. గడిచిన పది నెలల్లో పవన్‌ హన్స్‌లో కేంద్ర ప్రభుత్వం తనకున్న 51% వాటాలను రెండు సార్లు ఆఫర్‌ ఫర్‌ సేల్‌ ద్వారా విక్రయించేందుకు ప్రయత్నించింది.

అయితే, ఆ ప్రయత్నాలు విఫలమవగా.. ఈసారి ఓఎన్‌జీసీ వాటాను కూడా కలిపి వంద శాతం ఒకేసారి అమ్మేందుకు చేయనున్న ప్రయత్నాలు ఫలిస్తాయని ప్రభుత్వం భావిస్తోంది. ఇక ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో పూర్తిగా ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ అన్వేషణ, ఉత్పత్తిపై దృష్టిసారించి ఇతర వ్యాపారాల నుంచి తప్పుకోవాలని భావిస్తున్నామని.. ఇందులో భాగంగానే పవన్‌ హన్స్‌లో వాటా విక్రయిస్తున్నామని ఓఎన్‌జీసీ బోర్డ్‌ తెలిపింది. పవన్‌ హన్స్‌కు 46 హెలికాప్టర్లు ఉన్నాయి.  

మరిన్ని వార్తలు