ఎంఆర్పీఎల్లో వాటాల విక్రయం

28 Jul, 2016 02:32 IST|Sakshi
ఎంఆర్పీఎల్లో వాటాల విక్రయం

న్యూఢిల్లీ: కనీస పబ్లిక్ షేర్ హోల్డింగ్ నిబంధన మేరకు ఎంఆర్‌పీఎల్‌లో తమకున్న వాటాల్లో కొద్ది మేర  ఓఎన్‌జీసీ, హెచ్‌పీసీఎల్ విక్రయించే అంశాన్ని పరిశీలించనున్నాయి. ప్రస్తుతం ఎంఆర్‌పీఎల్‌లో ప్రజల వాటా 11.42 శాతం మాత్రమే ఉంది. ఓఎన్‌జీసీకి 71.63 శాతం, హెచ్‌పీసీఎల్‌కు 16.96 శాతం వాటా ఉంది. సెబీ నిబంధనల మేరకు లిస్టెడ్ కంపెనీలో కనీస ప్రజల వాటా 25 శాతం ఉండాలి.

వచ్చే ఏడాది ఆగస్ట్‌కి ఈ నిబంధనను అమలు పరచాలని సెబీ ప్రభుత్వ రంగ సంస్థలకు గడువు నిర్దేశించింది. దీంతో వచ్చే నెల 1న బోర్డు సమావేశమై పబ్లిక్ వాటా పెంచేందుకు అవకాశాలను పరిశీలించనున్నట్టు ఓ అధికారి తెలిపారు. ప్రమోటర్లు (ఓఎన్‌జీసీ, హెచ్‌పీసీఎల్) తమ వాటాను కొద్దిగా ఆఫర్ ఫర్ సేల్ మార్గంలో విక్రయించడం లేదా పబ్లిక్ ఆఫర్ ద్వారా తాజా షేర్లను జారీ చేయడం కంపెనీ ముందున్న మార్గాలుగా వెల్లడించారు.

మరిన్ని వార్తలు