ఓఎన్‌జీసీ సబ్సిడీ భారం తగ్గింది...

14 Aug, 2015 01:39 IST|Sakshi
ఓఎన్‌జీసీ సబ్సిడీ భారం తగ్గింది...

14% పెరిగిన నికర లాభం; రూ. 5,460 కోట్లు
 
 న్యూఢిల్లీ : ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్(ఓఎన్‌జీసీ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జూన్ క్వార్టర్‌కు రూ.5,460 కోట్ల నికర లాభం ఆర్జించింది. గత క్యూ1లో సాధించిన నికర లాభం(రూ.4,782 కోట్లు)తో పోల్చితే 14 శాతం వృద్ధి నమోదైందని ఓఎన్‌జీసీ తెలిపింది. ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు తాము  చెల్లించే ఇంధన సబ్సిడీ భారం తగ్గడం, ఉత్పత్తి పెరగడం వంటి కారణాల వల్ల నికర లాభం పెరిగిందని ఓఎన్‌జీసీ సీఎండీ డి.కె. సరాఫ్ చెప్పారు. గత క్యూ1లో రూ.13,200 కోట్లుగా ఉన్న సబ్సిడీ భారం ఈ క్యూ1లో రూ.1,133 కోట్లకు తగ్గిందని తెలిపారు.

ఈ సబ్సిడీ చెల్లింపు వల్ల నికర లాభం గత క్యూ1లో రూ.7,396 కోట్లు, ఈ క్యూ1లో రూ.628 కోట్లు చొప్పున తగ్గిందని వివరించారు. జనవరి-మార్చి క్వార్టర్‌కు చమురు ఉత్పత్తి తగ్గిందని, అయితే ఈ క్యూ1లో 2.2% వృద్ధితో 5.227 మిలియన్ టన్నులకు చేరిందని, గ్యాస్ ఉత్పత్తి మాత్రం 3% క్షీణించి 5.482 బిలియన్ క్యూబిక్ మీటర్లకు తగ్గిందని వివరించారు. ఆదాయం 4% వృద్ధితో రూ.22,868 కోట్లకు పెరిగిందని సరాఫ్ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు