రూ.కోటి ఆదాయం దాటిన వారెంతమందో తెలుసా?

8 Feb, 2019 12:47 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : 2018-19 సంవత్సరానికి గాను వార్షిక ఆదాయం కోటి రూపాయలు దాటిన వారి సంఖ్య 1.5 లక్షల మందిగా నమోదయ్యారు. డైరెక్ట్ టాక్స్ సెంట్రల్ బోర్డ్ (సిబిడిటి) చైర్మన్ సుశీల్ చంద్ర  అసోచామ్‌ సదస్సులో పాల్గొన్న  సందర్భంగా ఈ వివరాలను విడుదల చేశారు. 125కోట్ల జనాభా ఉన్న దేశంలో ఆర్ధికవృద్ధి 7.5శాతంగా ఉందని, కేవలం 1.5 లక్షల రిటర్నులు మాత్రమే కోటి రూపాయలకు పైబడిన ఆదాయం ఉన్నట్లు చూపిస్తున్నాయని పేర్కొన్నారు.

భారత్ లాంటి విస్తృతమైన, వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలో ఈ సంఖ్య ఇంకా తక్కువగానే ఉందన్నారు. జీడీపి, వినియోగం పెరుగుతున్న దశలో కేవలం 1.5 లక్షలమంది మాత్రమే రిటర్నులు దాఖలుచేయడం శోచనీయమన్నారు. 2014-15లో 69వేలు మాత్రమే ఉందని, ఆ సంఖ్య ఇపుడు 1.5 లక్షలకు చేరిందని పేర్కొన్నారు. ఇందులో ఎక్కువగా వేతనజీవులే  వున్నారనీ, సంస్థలు, కార్పొరేట్‌ సంస్థల్లోని వారి ఆదాయం వివరాలు నమోదు కాలేదని తెలిపారు.

ఏప్రిల్, జనవరి మధ్య ఈ ఏడాది కేవలం రూ.6.31 కోట్ల  ఆదాయం పన్నురిటర్న్‌ దాఖలు అయ్యాయని తెలిపారు. గత ఆర్థిక సంవత్సరం పోలిస్తే.. ఇది 37 శాతం ఎక్కువ. అలాగే 95 లక్షల మంది మొదటిసారిగా  ఆదాయ వివరాలను నమోదు చేసినట్టు తెలిపారు.  ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 1.25 కోట్ల అదనపు పన్ను చెల్లింపుదారులను ఆశిస్తే 1.06 కోట్ల కొత్త పన్ను చెల్లింపుదారులు మాత్రమే నమోదయ్యారని సీబీటీడీ ఛైర‍్మన్‌ వెల్లడించారు.

మరిన్ని వార్తలు