క‌రోనా అత‌న్ని బిలియ‌నీర్ చేసింది

8 Apr, 2020 20:37 IST|Sakshi

ప్ర‌పంచ దేశాలను అత‌లాకుత‌లం చేస్తోన్న‌ క‌రోనా మ‌హ‌మ్మారి మ‌ర‌ణ మృదంగం మోగిస్తోంది. వైర‌స్‌కు జ‌న్మ‌స్థాన‌మైన చైనాలోని వూహాన్‌లో ప‌రిస్థితి చ‌క్క‌బ‌డ్డ‌ప్ప‌టికీ మిగ‌తా దేశాల్లో మాత్రం దీని విజృంభణ ఎంత‌కూ త‌గ్గ‌డం లేదు. దీంతో దీని వ్యాప్తిని నివారించేందుకు ప‌లు దేశాలు లాక్‌డౌన్ బాట‌లో నడిచాయి. మ‌న దేశంలోనూ ప్ర‌భుత్వం 21 రోజులపాటు లాక్‌డౌన్‌ను విధించిన విష‌యం తెలిసిందే. ఇప్పుడు దాన్ని పొడిగించే ప్ర‌య‌త్నంలోనూ ఉంది. ఇదిలా ఉండ‌గా దేశంలో క‌రోనా వ‌ల్ల‌ ఆర్థిక సంక్షోభం రెట్టింపవ‌డంతోపాటు కేంద్ర‌, రాష్ట్ర ఖ‌జానాలు ఖాళీ అవుతున్నాయి. ఇంత‌టి విప‌త్క‌ర ప‌రిస్థితిలోనూ ఆదాయాన్ని వృద్ధి చేసుకున్న ఏకైక వ్య‌క్తి అవెన్యూ సూప‌ర్ మార్ట్ రిటైల్ బ్రాండ్ డీమార్ట్ అధినేత రాధాకిష‌న్ దామాని. (రిటైల్‌లో 80వేల ఉద్యోగాలకు గండం..)

ధ‌ర‌లు కాస్త త‌క్కువ‌గా ఉంటాయ‌న్న పేరుతో హైద‌రాబాద్ వంటి న‌గ‌రాల్లో జ‌నం ఎక్కువ‌గా డీమార్ట్‌లో షాపింగ్ చేసేందుకు ఆస‌క్తి చూపుతారు. పైగా లాక్‌డౌన్ వ‌ల్ల నిత్యావ‌స‌రాల‌కు కొర‌త వ‌స్తుందనే భ‌యంతో పెద్ద ఎత్తున జ‌నాలు డీమార్ట్ ముందు క్యూ క‌ట్టారు. వారి భ‌యాందోళ‌న‌లే అత‌నికి వ్యాపారం బాగా జ‌రిగేందుకు లాభ‌ప‌డ్డాయి. ఒక్క‌సారిగా కొనుగోళ్లు పెర‌గ‌డంతో ఆయ‌న సంప‌ద 5 శాతం పెరిగి 10.2 బిలియ‌న్ డాల‌ర్ల‌కు చేరుకుందని బ్లూంబెర్గ్‌ సంస్థ వెల్ల‌డించింది. దీంతో భార‌త్‌లోని టాప్ 12 శ్రీమంతుల్లో ఆయ‌న ఒక‌రుగా నిలిచారు. అంతేకాక డీమార్ట్ షేర్ విలువ సైతం ఏకంగా 18 శాతం పెరిగింది. క‌రోనాతో పోరాటానికి ఆయ‌న రూ.155 కోట్లు విరాళంగా ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే (క‌రోనాతో ఫైట్‌కు డీమార్ట్ రూ.155 కోట్ల విరాళం)

మరిన్ని వార్తలు