అద్భుత ఫీచర్లతో ఒప్పో ఎఫ్‌15, వారే టార్గెట్‌

16 Jan, 2020 12:59 IST|Sakshi

సాక్షి, ముంబై:  ప్రముఖ  మొబైల్‌ కంపెనీ ఒప్పో కొత్త ఫోన్‌ లాంచ్‌ చేసింది. ప్రధానంగా యువ కస్టమర్లను లక్ష్యంగా చేసుకుని  అత్యాధునిక ఫీచర్లతో ఒప్పో ఎఫ్‌ 15 స్మార్ట్‌ఫోన్‌ను గురువారం తీసుకొచ్చింది. వాటర్‌డ్రాప్-స్టైల్ నాచ్ డిజైన్‌తో అమోలెడ్ డిస్‌ప్లేతో వస్తున్న ఈ స్మార్ట్‌ఫోన్లో ఆకర్షణీయమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) ఆధారిత వీడియో బ్యూటిఫికేషన్‌,  కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్ట్‌, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్, వూక్‌ 3.0 ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ, వెనుక భాగంలో క్వాడ్‌ కెమెరా  ప్రధాన ఫీచర్లుగా ఉన్నాయి.  

ఒప్పో ఎఫ్‌15 ఫీచర్లు
6.4 అంగుళాల అమోలెడ్‌ డిస్‌ప్లే
ఆండ్రాయిడ్‌ 9 పై
1080x2400   పిక్సెల్స్‌ రిజల్యూషన్‌
8జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌
128 దాకా విస్తరించుకునే అవకాశం
48+8+2+2ఎంపీ రియర్‌ క్వాడ్‌ కెమెరా
16 ఎంపీ సెల్ఫీకెమెరా
4000 ఎంఏహెచ్‌ బ్యాటరీ

ధర :  రూ. 19,990 
అమెజాన్.ఇన్, ఫ్లిప్‌కార్ట్ ,  ఒప్పో ఇండియా ఆన్‌లైన్ స్టోర్ ద్వారా ప్రీ-ఆర్డర్‌లలో ఈ రోజు నుండి ప్రారంభం.  మొదటి అమ్మకం జనవరి 24 న జరగనుంది.

లాంచింగ్‌ ఆఫర్లు:  వన్-టైమ్ స్క్రీన్ రీప్లేస్‌మెంట్, హెచ్‌డిఎఫ్‌సి కార్డ్ వినియోగదారులకు 10 శాతం క్యాష్‌బ్యాక్ 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా