వాలెట్ యూజర్లకు సూక్ష్మ రుణాలు

23 May, 2016 01:28 IST|Sakshi
వాలెట్ యూజర్లకు సూక్ష్మ రుణాలు

* రూ.500-2,500 రేంజ్‌లో
* అందిస్తున్న మోబిక్విక్

న్యూఢిల్లీ: ఫైనాన్షియల్ టెక్నాలజీ కంపెనీ మోబిక్విక్ తన సేవలను మరింతగా విస్తరిస్తోంది. బ్యాలెన్స్ అయిపోయిన వాలెట్ యూజర్లకు తక్షణ సూక్ష్మ రుణాలను (రూ.500-2,500 రేంజ్‌లో)ఆఫర్ చేస్తోంది. దేశంలో డిజిటల్ చెల్లింపుల వినియోగం జోరు పెంచడానికి ఈ రుణాలను ఆఫర్ చేస్తున్నామని మోబిక్విక్ తెలిపింది. ప్రయోగాత్మకంగా ఈ ఇన్‌స్టంట్ మైక్రోలోన్స్‌ను కొన్ని వారాల క్రితమే ప్రారంభించామని మోబిక్విక్ వ్యవస్థాపకుల్లో ఒకరైన ఉపాసన తకు చెప్పారు.

ఇప్పటికే 25వేల మంది యూజర్లకు ఈ రుణాలు ఇచ్చామని పేర్కొన్నారు. ఈ రుణాలు తీసుకున్నవాళ్ల చెల్లింపులు 97 శాతంగా ఉన్నాయని, ఈ కొత్త సర్వీస్ సంతృప్తికరంగా ఉందని తెలిపారు. ఈ సర్వీస్‌ను మరింతగా విస్తరించాలనుకుంటున్నామని వివరించారు. కన్సూమర్ లెండింగ్ మార్కెట్ ప్లేస్ క్యాష్‌కేర్ భాగస్వామ్యంతో ఈ సర్వీస్‌ను అందిస్తున్నామని వివరించారు. వచ్చే కొన్నినెలల్లో 2-3 లక్షల మంది యూజర్లకు ఈ రుణాలివ్వనున్నట్లు తెలిపారు.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా