గూగుల్‌ ప్లే యాప్స్‌పై సంచలన రిపోర్ట్‌

17 Apr, 2018 09:59 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఒకవైపు ఫేస్‌బుక్‌ డేటా లీక్‌ వ్యవహారం యూజర్లలో అనేక సందేహాలను ,భయాలను రేకెత్తించగా  తాజాగా  ఓ సంచలన రిపోర్టు  యూజర్ల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది.  గూగుల్   పిల్లలను గోప్యతా చట్టాలను  ఉల్లఘింస్తోందనే  ఆరోపణలుమరోసారి చెలరేగాయి. గూగుల్‌కు చెందిన 3వేలకు పైగా  అత్యంత ప్రాచుర్యం  పొందిన  ఉచిత యాప్స్‌లో  వినియోగదారుల వ్యక్తగత  వివరాలను అక్రమంగా  ట్రాక్‌ అవుతోంది.  ముఖ్యంగా  బాలల వ్యక్తిగత సమాచారాన్ని  అక్రమంగా సేకరిస్తోంది.   అమెరికా ఫెడరల్‌  చట్టంలోని పిల్లల ఆన్‌లైన్‌ గోప్యతా రక్షణ చట్టం ( చిల్డ్రన్స్‌ ఆన్‌లైన్‌ ప్రైవసీ ప్రొటెక్షన్‌ యాక్ట్‌)కు అనుగుణంగా ఉన్నాయో లేదో నిర్ధారించుకునేందుకు  నిర్వహించిన ఒక  ఇండిపెండెంట్‌ సర్వే ఈ షాకింగ్‌ అంశాలను వెల్లడించింది.  ఒక నూతన ఆటోమేటెడ్ సిస్టమ్‌ ద్వారా ఈ పరిశోధన నిర్వహించినట్టు పరిశోధకులు వెల్లడించారు.

ఇంటర్నేషనల్ కంప్యూటర్ సైన్స్ ఇన్స్టిట్యూట్ రీసెర్చ్ (ఐసిఎస్ఐ)  నివేదించిన సమాచారం ప్రకారం,  పరిశోధనలో భాగంగా గూగుల్ ప్లేలోని  మొత్తం 5,855 ఆండ్రాయిడ్ యాప్స్‌ను పరిశీలించింది. వీటిలో సగానికి (3,337) పైగా ఫ్యామిలీ, పిల్లల యాప్స్‌ అమెరికా  గోప్యతా చట్టాలను ఉల్లంఘించాయని పేర్కొంది. ముఖ్యంగా పిల్లలకు సంబంధించిన సమాచారాన్ని అక్రమంగా  తస్కరిస్తున్నాయని  తల్లిదండ్రుల అనుమతి లేకుండా  సుమారు 256 యాప్స్‌ 13 సంవత్సరాల లోపు పిల్లల లొకేషన్‌ డేటాను కూడా సేకరించిందట. ఇంత కీలకమైన వ్యక్తిగత వివరాలను సేకరించడం ఆందోళన కలిగించే అంశమని   రిపోర్టు పేర్కొంది. వీటిలో  పేర్లు, ఇమెయిల్, చిరునామాలు, ఫోన్ నంబర్లు లాంటివి ఉన్నాయని ఇండిపెండెంట్ నివేదిక పేర్కొంది. అయితే దీనిపై స్పందించేందుకు గూగుల్‌ ప్రతినిధులు అందుబాటులో లేరని తెలిపింది. గూగుల్‌కు చెందిన వీడియో ప్లాట్‌ఫాం యూ ట్యూబ్‌ ఉద్దేశపూర్వకంగా పిల్లల డేటాను సేకరిస్తూ  కోపా నిబంధలను ఉల్లంఘింస్తోందంటూ 20కిపైగా కన్జ్యూమర్‌ ఎడ్వకసీ  గ్రూప్స్‌ ఆరోపణల నేపథ్యంలో ఈ  అధ్యయనం చేసింది. 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ప్రమోషన్లు, కొత్త నియామకాలు నిలిపివేత

అమ్మకాల  సెగ : భారీ నష్టాలు

ఈ ప్రోత్సహకాలు లాభాన్నిచ్చేవే..!

జొమాటో, స్విగ్గీ పోటా పోటీ

ముకేశ్‌ అంబానీ వేతనం ఎంతంటే..

డాబర్‌ ఇండియాకు కొత్త చైర్మన్‌

‘సోలార్‌’.. కేరాఫ్‌ ప్రాకృతిక్‌ పవర్‌!

షావొమీ ‘గోల్డ్‌’ ఫోన్‌ @ 4.8 లక్షలు

ఫుట్‌బాల్‌ టికెట్లు, వాచీలు..!

ధనాధన్‌ రిలయన్స్‌!

ఇన్వెస్టెర్రర్‌ 2.0

ఆర్‌ఐఎల్‌ ప్రోత్సాహకర ఫలితాలు

ఆర్‌బీఎల్‌ ఫలితాలు భేష్‌..షేరు క్రాష్‌

530 పాయింట్లు కుప్పకూలిన మార్కెట్లు 

సుజుకీ ‘జిక్సర్‌’ కొత్త వెర్షన్‌

ఎయిర్‌టెల్‌కు మరోసారి జియో షాక్‌

పేటీఎమ్‌ మాల్‌లో ఈబే చేతికి 5.5% వాటా

ఫెడ్‌ రేట్‌ కట్‌ అంచనా : పసిడి పరుగు

ఆర్థిక బిల్లు ఎఫెక్టా? మార్కెట్ల పతనం

లాభాల జోరు : 39 వేల ఎగువకు సెన్సెక్స్‌

డుమాంట్‌.. ప్రీమియం ఐస్‌క్రీమ్స్‌

ఎల్‌ అండ్‌ టీ ఇన్ఫోటెక్‌ లాభం 359 కోట్లు

అకౌంట్లతో పనిలేదు..

అలహాబాద్‌ బ్యాంకులో మరో మోసం

తప్పనిసరై జాతీయం.. తప్పులతో పతనం

ఫేస్‌ స్లిమ్మింగ్‌ ఫీచర్‌తో ఒప్పో ఏ9

మరో కుంభకోణం : షేర్లు ఢమాల్‌

నిజామాబాద్‌లో వాల్‌మార్ట్‌ ప్రారంభం

ఇంటెలిజెంట్‌ వెహికల్స్‌ రయ్‌!

ఎలక్ట్రిక్‌ వాహన బ్యాటరీలు... తెలంగాణకు 3 కంపెనీలు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బిగ్‌బాస్‌ ట్రెండింగ్‌పై నాగార్జున ట్వీట్‌

తమిళ దర్శకుల సంఘం అధ్యక్షుడిగా సెల్వమణి

జాన్వీకపూర్‌తో దోస్తీ..

రకుల్‌కు చాన్స్‌ ఉందా?

ఆలియా బాటలో జాక్వెలిన్‌

తమిళంలో తొలిసారి