ఫేస్ బుక్ దుఖానికి చేటు

29 May, 2017 18:56 IST|Sakshi
ఫేస్ బుక్ దుఖానికి చేటు
ఫేస్ బుక్... స్మార్ట్ ఫోన్ చేతిలో ఉన్న వారు ప్రతిఒక్కరూ వాడే పాపులర్ సామాజిక మాధ్యమం. కాసేపు తినకుండానైనా ఉంటారేమో కాని ఫేస్ బుక్ అప్ డేట్లు చూసుకోకుండా మాత్రం క్షణం కూడా ఆగలేరు. ఇటీవల అంతలా అడిక్ట్ అయిపోతున్నారు. తాజాగా అప్ లోడ్ చేసిన పోస్టులకు ఎన్ని నోటిఫికేషన్లు వస్తున్నాయి, ఎన్ని లైక్స్, షేర్లు, కామెంట్లు వెల్లువెత్తుతున్నాయో కంటిన్యూగా చెక్ చేసుకుంటూనే ఉంటున్నారు నేటితరం యువత. శరవేగంగా వృద్ధి చెందుతున్న ఫేస్ బుక్ ఈ తరం మీద గణనీయమైన ప్రభావం చూపుతుందని తాజా అధ్యయనం తెలిపింది. అది ఏ మేర కంటే, మితిమీరిన ఫేస్ బుక్ వాడకంతో దుఖం, అనారోగ్యం సమస్యలతో యూజర్లు సతమతమయ్యే స్థాయికి దారి తీస్తుందని  తాజా అధ్యయనం పేర్కొంది.
 
అప్పుడప్పుడు ఫేస్ బుక్ ప్రొఫైల్ ను చూసుకునే వారికంటే.. కంటిన్యూగా ప్రొఫైల్ ను చెక్  చేసుకునేవారికి ఎక్కువ దుఖం, అనారోగ్యం ఉన్నట్టు ఈ అధ్యయనం గుర్తించింది. ఇప్పటికే సోషల్ మీడియా అడిక్ట్ అయ్యే వారికి నిద్రాభంగమవుతుందని, అనారోగ్య సమస్యలు వస్తున్నాయని పలు రిపోర్టులు కూడా హెచ్చరించాయి. అయినప్పటికీ చాలామంది తమ ఫేస్ బుక్ అడిక్షన్ తోనే జీవిస్తున్నారు. యేల్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాకు చెందిన రీసెర్చర్లు 2013, 2015 కాలంలో ఈ అధ్యయనం చేపట్టారు. 5,208 మంది వాలంటీర్లపై చేపట్టిన ఈ అధ్యయనంలో ఫేస్ బుక్ వాడకం, వారి మానసిక ఆరోగ్యానికి సంబంధించి రీసెర్చ్ చేశారు. ఎవరైతే పదేపదే తమ ప్రొఫైల్స్ లేదా పోస్టులను మార్చుతున్నారో వారికి ఎక్కువగా మానసిన ఆరోగ్య సమస్యలున్నట్టు రీసెర్చర్లు గుర్తించారు.   
 
>
మరిన్ని వార్తలు