ఈ నెల 31 తర్వాత పాన్‌ పనిచేయదు!

17 Mar, 2020 05:46 IST|Sakshi

న్యూఢిల్లీ: పాన్‌ను ఆధార్‌తో అనుసంధానించడం తప్పనిసరి అని, ఇందుకు ఇచ్చిన గడువు ఈ నెల 31న ముగుస్తుందంటూ ఆదాయపన్ను శాఖ మరోసారి గుర్తు చేసింది. గడువు నాటికి అనుసంధానం చేసుకోకపోతే.. అప్పుడు పాన్‌ పనిచేయకుండా పోతుందని హెచ్చరించింది. బయోమెట్రిక్‌ ఆధార్‌ ఆథెంటికేషన్‌ లేదా పాన్‌ సేవా కేంద్రాలను సందర్శించడం ద్వారా అనుసంధానం చేసుకోవచ్చని తెలిపింది. ఈ మేరకు ఆదాయపన్ను శాఖ తన ట్విట్టర్‌ పేజీలో ఒక వీడియోను సైతం పోస్ట్‌ చేసింది.  ్ఖఐఈ్కఅN అని టైప్‌ చేసి స్పేస్‌ ఇచ్చి ఆధార్‌ నంబర్‌ టైప్‌ చేసి స్పేస్‌ ఇచ్చి, పాన్‌ నంబర్‌ టైప్‌ చేసిన తర్వాత 567678 నంబర్‌కు ఎస్‌ఎంఎస్‌ చేయడం ద్వారా అనుసంధానం చేసుకోవచ్చు. అలాగే, ఆదాయపన్ను శాఖ ఈఫైలింగ్‌ పోర్టల్‌  ఠీఠీఠీ. జీnఛిౌఝ్ఛ్ట్చ్ఠజీnఛీజ్చ్ఛీజజీ జీnజ. జౌఠి. జీn కు వెళ్లి కూడా అనుసంధానం చేసుకోవచ్చు. 

>
మరిన్ని వార్తలు