అద్భుత ఫీచర్లు: ఎలుగా రే 550

3 Apr, 2018 20:23 IST|Sakshi

పానసోనిక్‌ కొత్త స్మార్ట్‌ఫోన్‌

రెడ్‌మి 5కు పోటీ

అద్భుత ఫీచర్లు

ఏప్రిల్‌ 5నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో

సాక్షి, న్యూఢిల్లీ: ఎలక్ట్రానిక్స్ తయారీదారు పానసోనిక్ అద్భుత ఫీచర్లతో కొత్త  4జీ  స్మార్ట్‌ఫోన్ లాంచ్‌ చేసింది. ఎలుగ రే 550పేరుతో మంగళవారం  కొత్త డివైస్‌ను  విడుదల చేసింది. బ్లాక్, బ్లూ, గోల్డ్ రంగుల్లో ఈ ఫోన్ వినియోగదారులకు రూ.8,999 ధరకు ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా ప్రత్యేకంగా లభ్యం కానుంది. ఈ నెల 5వ తేదీ నుంచి ఈ ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. ఇక  ఎఐ బేస్డ్‌ వర్చువల్‌ అసిస్టెంట్‌ అర్బో, భారీ స్క్రీన్‌,  స్మార్ట్‌ లాక్‌ , ఫింగర్‌ ప్రింట్‌ సెన్సర్‌ ఈ ఫోన్‌లో ప్రధాన  ఫీచర్లుగా ఉన్నాయి. అలాగే ముందు, వెనుక భాగాల్లో రెండు కెమెరాలకు ఫ్లాష్‌తో తీసుకొచ్చింది. ముఖ్యంగా రెడ్‌ మి 5 కు పోటీ ఫీచర్లు దీన్ని లాంచ్‌ చేయడం  మరో విశేషం.

పానసోనిక్ ఎలుగా రే 550 ఫీచర్లు
5.7 ఇంచెస్‌ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే 18.9యాస‍్పెక్ట్‌ రేషియో
1440 x 720 పిక్సెల్స్‌ స్క్రీన్ రిజల్యూషన్
2.5 కర్వ్‌డ్‌  గ్లాస్‌
ఆండ్రాయిడ్ 7.0 నౌగాట్‌
1.3 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్
3 జీబీ ర్యామ్
32 జీబీ స్టోరేజ్
128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
13 ఎంపీ బ్యాక్ కెమెరా విత్‌ ఎల్‌ఈడీ ఫ్లాష్
8 ఎంపీ సెల్ఫీ కెమెరా  విత్‌ ఎల్‌ఈడీ ఫ్లాష్
3250 ఎంఏహెచ్ బ్యాటరీ

మరిన్ని వార్తలు