150 ప్రైవేట్‌ ట్రైన్స్‌కు గ్రీన్‌ సిగ్నల్‌..

8 Jan, 2020 15:48 IST|Sakshi
ప్రతీకాత్మకచిత్రం

సాక్షి, న్యూఢిల్లీ : ముంబై-ఢిల్లీ, హౌరా-ఢిల్లీ సెక్టార్లు సహా వంద రూట్లలో దాదాపు 150 ప్రైవేట్‌ రైళ్కు హైపవర్‌ కమిటీ పచ్చజెండా ఊపింది. తేజాస్‌ ట్రైన్లను ఇప్పటికే ప్రైవేట్‌ రంగంలో పైలెట్‌ ప్రాజెక్టు కింద నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ప్రైవేట్‌ రైళ్లకు హైపవర్‌ కమిటీ గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడంతో ప్రభుత్వ రంగ రైల్వేలకు గట్టి పోటీకి దారులు తెరుచుకుంటాయని భావిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ వంద రోజుల అజెండాకు అనుగుణంగా రైల్వే బోర్డు ఛైర్మన్‌ వీకే యాదవ్‌ ప్రైవేట్‌ రైళ్లకు ఆమోదముద్ర వేసిన క్రమంలో హైపవర్‌ కమిటీని రైల్వే మంత్రి పీయూష్‌ గోయల్‌ ఏర్పాటు చేశారు.

ప్రైవేట్‌ రైళ్ల నిర్వహణకు ఖరారైన మార్గదర్శకాల ప్రకారం రైల్వే, టూరిజం రంగాల్లో అనుభవమున్న భారత, అంతర్జాతీయ కంపెనీలు ప్రైవేట్‌ రైళ్ల నిర్వహణకు పోటీపడవచ్చు. రూ 450 కోట్ల కనీస నికర విలువ కలిగిన సంస్థలను ఇందుకు అనుమతిస్తారు. ఇక ప్రయాణీకులకు మెరుగైన సేవలు, రైళ్ల రాకపోకల్లో 15 నిమిషాలకు మించని జాప్యం వంటి ఇతర నిబంధనలను ఆయా కంపెనీలు పాటించాల్సి ఉంటుంది. తొలుత ఢిల్లీ-ముంబై, ఢిల్లీ-కోల్‌కతా రూట్లలో ప్రైవేట్‌ రైళ్ల నిర్వహణకు అనుమతించనున్నారు. ఈ రూట్లలో రైళ్ల వేగం గంటకు 160 కిమీ ఉండేలా ట్రాక్స్‌ను మెరుగుపరిచేందుకు రైల్వేలు సన్నాహాలు చేస్తున్నాయి.

మరిన్ని వార్తలు